Telangana News: బతుకమ్మ చీరల పంపిణీ షురూ, మొదటి చీర ఎవరికి.
1 min read
బతుకమ్మ చీరల పంపిణీ షురూ
పేదింటి ఆడబిడ్డ ఉత్సాహంగా బతుకమ్మను జరుపుకోవాలి అని గిరిజన , స్త్రీ , శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. పేదింటి ఆడబిడ్డ ఉత్సాహంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే చిరు కాసుక బతుకమ్మ చీర అని రాష్ట్ర గిరిజన , స్త్రీ , శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్య పతిరాథోడ్ అన్నారు . శుక్రవారం వరంగల్ భద్రకాళి దేవస్థానంలో తెలం గాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇస్తున్న బతుకమ్మ చీరలను అమ్మవార్లకు సమర్పించి ఈ కార్యక్రమం సజావుగా , విజయవంతంగా జర గాలని రాష్ట్ర గిరిజన , శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ , ఎంపీ పసునూరి దయాకర్ , నగర మేయర్ గుండా ప్రజారావు , మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధా రాణి , కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు , జిడ్యువంసి కమిషనర్ పమేలా సత్యవతి మొక్కుకున్నారు . అమ్మవారికి బరుకమ్మ చీర పెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు .
అనంతరం భద్రకాళి దేవస్థానంలో సమీపంలో గల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చరబండరాజునగర్ లో 14 , 27 వ వార్డు మహిళలకు బతుకమ్మ చీరలను వారు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ అందించే చిరు కానుకే అయిన గో ప్పగా ఉండాలని ప్రభుత్వం రూ . 2 కోట్లు వెచ్చింది . 207 డిజైన్లతో దగదగా మెరిసే నాణ్యమైన కోటి చీరెలు తయారు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందిస్తున్నట్లు తెలిపారు . తెల్లరేషన్ కార్డు ఉండి 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చీరలను అందించడం జరుగుతుందన్నారు . కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని చీరెలు పంపిణీ చేయాలన్నారు .
కరోనా కష్టకాలంలో చేనేతన్నలకు ఉపాధి కల్పించి ముఖ్యమంత్రి అండగా నిలబడ్డారని , ఫలితంగా ఆత్మహత్యలు జరగలేదని తెలిపారు . 8.10 లక్షల చీరెలు అవనరమని అంచనా వేసి కోటి చీరలు తయారు చేసి అందులో 89,28,702 చీరెలు 6.10 మీటర్లు కాగా 2,21,301 చీరెలు 3 మీటర్లు చేశారని మంత్రి చెప్పారు . గత నాలుగేండ్లలో ప్రభుత్వం రూ .125 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు . ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి బడుగు , బలహీన వర్గాల అభ్యు న్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నడన్నా రు . కోవిడ్ ప్రభావం ఉన్నా బతుక మ్మ చీరెలు అందిస్తున్న దార్శనీకు డు సిఎం కెసిఆర్ అని తెలిపారు . ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టిన ప్ర ఈ కార్యక్రమం , సంక్షేమ ఫలాలు ఆర్పులకు అందిస్తామన్నారు . నేత న్నలకు చేతినిండా పని కల్పించి ఆత్మహత్యలను నివారించడం జరి గిందన్నారు . వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం లో బతుకమ్మకు ప్రత్యేకత ఉందని , రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం హిందు , ముస్లిం , క్రైస్తవుల పండుగలకు ఆడపడుచులకు చీరలు అందిస్తున్న మహనీయులు కెటీర్ అని అన్నారు . ఈ కార్య క్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గుండు సుధారాణి , నగర మేయర్ గుండా ప్రవు . గ్రేటర్ కమిషనర్ పమేలా సత్యవతి , కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ , అదనపు కమిషనర్ నాగేశ్వర్ , అధికారులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
