May 12, 2025

Digital Mixture

Information Portal

Know about ఆయుధ పూజ , శమీ పూజ (జమ్మి చెట్టు), పాల పిట్ట దర్శనం.

1 min read
Ayudha Pooja,Jammi Chettu,Paala Pitta,ఆయుధ పూజ,శమీ పూజ,జమ్మి చెట్టు,పాల  పిట్ట దర్శనం,Know about Dussehra,Dussehra,Dussehra Festival

Durga Devi Ayudha Pooja

ద్వాపర యుగంలో అరణ్యవాసం వెళ్ళే  సమయంలో పాండవులు తమ తమ ఆయుధాలను శమీ  వృక్షంపై దాచిపెట్టి, వారు తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకి మొక్కి వెళ్ళడం జరుగుతుంది. అరణ్య వాసం ముగుసిన తరువాత  విజయ దశమి  రోజున పాండవులు జమ్మి చెట్టుని పూజించి వారి ఆయుధాలని తీసుకుంటారు. ఆ ఆయుధాలతో కౌరవులపై విజయం సాధించి రాజ్యాధికారాని పొన్దిఉతారు. ఆ రోజునుండే ఆయుధ పూజ ఆచారంలోకి వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. అప్పటినుండి, రాజులు, సైన్యం తమ ఆయుధాలను దసరా రోజున పుజించేవారు. శ్రామికులు, కార్మికులు, తమ పనిముట్లకు పూజా చేసి వారు, వాళ్ళ పిల్లలు, వారి గ్రామం అంతా బాగుండాలని అమ్మవారిని వేడుకుంటారు.

దసర రోజు, వారి వారి పద్దతుల ప్రకారం, పిండి వంటలు, రక రకాల వంటకాలు చేసుకుంటారు.తోబుట్టువులను, అల్లుళ్ళను పిలిచి గౌరవించుకుంటారు. గ్రామాల్లో రాజు వారి గడీలు, గండి మైసమ్మ, కోట బుర్జుల వద్ద సోరకాయలను నరికి గ్రామ దేవతల నివేదనలు చేసి, పారు వేటకు వెళ్లుతారు. జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు.

Ayudha Pooja,Jammi Chettu,Paala Pitta,ఆయుధ పూజ,శమీ పూజ,జమ్మి చెట్టు,పాల  పిట్ట దర్శనం,Know about Dussehra,Dussehra,Dussehra Festival
Jammi Chettu, Image Source: Wikipedia

ఇక్కడ జమ్మి చెట్టు గురించి చెప్పుకోవాల్సి ఉంది. జామి చెట్టు త్వరగా పుచ్చిపోదు, చెద పట్టదు. అందుకని, పాండవులు అక్కడ దాచారని చెబుతుంటారు.  జమ్మి ఔషద వృక్షం కూడా. జమ్మి చెట్టు చుట్టూ ప్రదిక్షణ చేస్తే దాని నుండి వెలువడే గాలి కొన్ని రోగాలకు ఔషద చికిత్సగా చెబుతుంటారు. జమ్మి పూజ చేస్తే కొన్ని గ్రహదోషాలు తొలుగుతాయని జ్యోతిష్యం చెబుతోంది. గ్రామ పురోహితునితో జామి చెట్టు వద్ద గ్రామ పెద్దలు, ముఖ్యులతో పూజలు చేస్తారు.  అలా పూజలు చేసిన తరువాత ఆ జమ్మి ఆకును తీసుకొని వెళ్లి పెద్ద వారి చేతిలో  పెట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటారు.

ఆ తర్వాత జమ్మి చెట్టు క్రింద ఇలా వ్రాస్తారు.

శమీ శమియతే పాపం, శమీ శత్రు వినాశం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శని

శమీ శమియతే పాపం: శమీ వృక్షం  పాపమును క్షమించుతుంది.

శమీ శత్రు వినాశం: శమీ వృక్షం పై దాచిన ఆయుధాలతో శత్రువుల వినాశం.

అర్జునస్య ధనుర్ధారి: అర్జున, గాన్డీవాదులను కాపాడినది.

రామస్య ప్రియదర్శని: రాముడు యుద్దానికి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టు దర్శనం జరిగిందని చెబుతుంటారు.

గ్రామస్తులు ఈ శ్లోకాన్ని,కాగితం పై వ్రాసి, చెట్టుకు కడతారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప కలుగుతుందని నమ్మకం.  ఆ  తరువాత టపాసుల  శబ్ధాలతో సంబరాలు జరుపుకుంటారు. పూర్వకాలంలో బందూకులు కాల్చేవారని చెబుతుంటారు.

Ayudha Pooja,Jammi Chettu,Paala Pitta,ఆయుధ పూజ,శమీ పూజ,జమ్మి చెట్టు,పాల  పిట్ట దర్శనం,Know about Dussehra,Dussehra,Dussehra Festival
Paala Pitta, Image Source: Wikipedia

జమ్మి  చెట్టుపై నుండి ఆయుధాలని తీసుకునే సమయంలో పాండవులకు  పాలపిట్ట దర్శనం కలిగిందట. అప్పటినుండి దసర రోజున పాల పిట్టను చూసే సంప్రదాయం మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *