May 12, 2025

Digital Mixture

Information Portal

Mahesh Babu Next Movie: సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు సినిమా ఏంటి? డైరెక్టర్ ఎవరు…

1 min read
Mahesh Babu, ANil Ravipudi, Parusharam, Mahesh Babu Next movie, Sarileru Neekevvaru,

Anil Ravipudi With Mahesh Babu, Image Source: Google

ప్రస్తుతం మహేష్ బాబు పరుశరాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయి చాలా రోజులైంది. కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ జరగలేదు. ప్రస్తుతం షూటింగ్ కి అనుకూల వాతావరణం ఏర్పడటంతో డైరెక్టర్ పరుశరాం ఆయా ఏర్పాట్లలో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం జనవరి 2021 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ హాలిడే మూడ్ లో ఉన్నారు. విదేశాలనుండి తిరిగి వచ్చి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.

సర్కారు వారి పాట తరువాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడనే విషయం మీద ఇండస్ట్రీ లో చాలా వార్తలు వినబడుతున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి కి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ 2021 సంక్రాతికి వద్దామనుకుంటే కరోనా దెబ్బ తీసింది. అందుకే సంక్రాంతి నుండి సమ్మర్ కి షిఫ్ట్ అయితున్నట్టు తెలుస్తోంది. అయితే పరుశరాం సర్కారు వారి పాట ని 6 నెలల లోపు పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే 2022 సంక్రాంతి కి అయినా మహేష్ కొత్త సినిమా తో రావాలనుకుంటున్నాడట. దీనికోసం తక్కువ సమయంలో సినిమాని పూర్తి చేసే దర్శకుడు కావాలి. దీనికోసం మహేష్ బాబు సంక్రాంతి కి సరిలేరు నీకెవ్వరు తో హిట్ ని ఇచ్చిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమాని తీయడానికి రెడీగా ఉన్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి కూడా చాలా తక్కవ సమయంలో పక్కా ప్లానింగ్ తో సినిమా తీసి విజయాన్ని అందిచగలడని పేరుంది.

అయితే మహేష్ బాబు, ఒక సారి హిట్ ఇచ్చిన దర్శకులతో రెండో సారి సినిమా తీస్తే అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయని సినీ పండితుల అభిప్ర్రాయం. అయితే అనిల్ రావిపూడి తో సినిమా షూటింగ్ వరకు వెళ్తుందా లేక వంశీ పైడిపల్లి తో సినిమా లాగా వెనక్కి వెళ్తుందా అనేది కాలమే చెప్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *