త్వరలో ప్రభాస్, హను రాఘవపూడి సినిమా! Prabhas and Hanu Raghavapudi movie soon
1 min read
Prabhas Hanu Raghavapudi Movie
ప్రభాస్ కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇండియా మొత్తం కల్కి 2898 AD నామ స్మరణ చేస్తున్నారు. అప్పుడే ప్రభాస్ తరువాత చేయబోయే సినిమాల గురించి చర్చ జరుగుతోంది. ప్రభాస్ కూడా ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు కాకుండా కొత్త సినిమాలను లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ చేతిలో ఇప్పటికే Salaar Part 2, Raja Saab, , కల్కి పార్ట్ 2 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ఇవి కాకుండా ఇప్పడు ఒస్తున్న వార్తల ప్రకారం, ప్రభాస్, హను రాఘవపూడి కలయికలో ఒక సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. హను రాఘవపూడి ప్రేమ కథలతో ప్రేక్షకులను కట్టిపడేసే దర్శకుడు. సీతా రామం సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంశలు అందుకున్నాడు హను రాఘవపూడి.

ఇప్పుడు ప్రభాస్ తో కూడా మంచి ప్రేమ కథా చిత్రం, ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గట్టుగా తీయడానికి కథని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
