May 21, 2024

Digital Mixture

Information Portal

పరిచయం- Introduction

1 min read
Telugu Literature, Telugu Movie Lyricists, Lyricists in Telugu,

Telugu Sahityam by Nagendra Chary

ప్రకృతి,పరిసరాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయంటారు. అటువంటి ప్రకృతిలో నుండి పుట్టిన పాట వినోదమే కాకుండా భావోద్వేగాలను,మన ఆలోచన విధానాలను మారుస్తూ కొన్నిసార్లు ప్రేరణగా నిలుస్తాయనడానికి ఉదాహరణగా ఓ ఎనిమిదవ తరగతి చదువుతున్న పిల్లవాడు అనుకోకుండా  ఒక రోజు టీవీ లో వస్తున్న పాట (రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే) వింటూ ప్రభావితుడై అప్పటిదాకా ఆ సంగీతంలో ఉన్న మాధుర్యాన్ని మాత్రమే అనుభూతి చెందడమే కాకుండా ఆ పాట పుట్టుక, దాని తాలూకు పరిమళాలను, సాహిత్య విలువలను గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు.

ఆ పరిశోధనలో ఓ పాట వెనుక సంగీత దర్శకుడే కాకుండా గీతరచయిత  కూడా ఉంటాడని ఆయనే పాటకు పదాలు కూరుస్తాడని, వారే వేటూరి గారు అని తెలుసుకుని తను కూడా తెలుగు భాష పదసంపద పెంపొందించుకుంటూ,అంతేకాకుండా  ప్రతీ పాటకి కూడా ఒక ఆకృతి అంటే ఒక పల్లవి, అనుపల్లవి మరియు రెండు చరణాలుంటాయి అని మళ్ళీ  ఈ గీతాలు పలు రకాలు వినోద ప్రాధాన్య గీతాలు,యుగళ గీతాలు, విరహ గీతాలు, ప్రబోధ గీతాలు, నేపథ్య గీతాలు,విప్లవ గీతాలు, శృంగార గీతాలు, ఇలా వివిధ గీతాలు ఉంటాయని తెలుసుకుని తనుకూడా  మెల్ల మెల్లగా కలం కదపడం మొదలు పెడతాడు.

అలా ప్రేరణ పొందిన ఆ పిల్లవాడే నేను మీ నాగేంద్రాచారి గా, మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడిప్పుడే గీతరచన వైపు అడుగులు వేస్తున్న నాకు ప్రస్తుతం ఉన్న తరుణంలో చాలా మంది యువతకు సాహిత్యం పైన తక్కువ అవగాహన ఉంటున్నదని అందువలన కేవలం పాటలోని  సంగీతాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ,సాహిత్య విలువలను కానీ, అందులో దాగివున్న భావ మాధుర్యాలని గానీ అనుభవించలేకపోతున్నారని అనిపించి పాటలోని ప్రతి అనుభూతిని మీకూ పంచుదామన్న ఈ చిన్న ప్రయత్నం లో భాగంగా ఇలా పాటను పరిచయం చేస్తూ నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. అలాగే  సమకాలీన సాహిత్య పోకడలు, ప్రముఖ వ్యక్తులతో ముఖాముఖి, భాష సంస్కృతి, కొత్త పుస్తకాలు వాటి పరిచయం,  జాతీయాలు వాటి వివరణ, సామెతలు వాటి విశ్లేషణ, ఋతువులు వాటి ప్రాముఖ్యత, కవుల పరిచయాలు ఇలా మన సాహిత్య పరమైన విషయాలను యువత / తెలుగు సాహిత్యం పై మక్కువ ఉన్న వారందరితో పంచుకోవాలనుకుంటున్నాను.

ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఇందులో నా అవగాహన మేరకు నా దృక్కోణంలో, నేను విని అర్థం చేసుకుని నాకున్న పరిజ్ఞానం మేరకు సంబంధిత విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఇందులో ఏవైనా  తప్పు ఒప్పులు ఉన్నాయని మీకు అనిపిస్తే పాఠకులు మీ పెద్దమనసుతో క్షమించి సరిదిద్ది  నన్ను ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ నాగేంద్రాచారి.

మీ సందేహాలను, సూచలను క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.

అందులో భాగంగా ఉప్పెన తెలుగు సినిమా లోని రంగులద్దుకున్న పాటతో మీ ముందు కొస్తున్నాను.

చదవండి: రంగులద్దిన పాట … Song from UPPENA Telugu Movie

2 thoughts on “పరిచయం- Introduction

  1. Chala excellent ga meeru ranguladhukunna pata gurinchi explain chesaru, excited to know the inner meaning of the song, it’s really a great attempt to do this service to telugu language . 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *