Big Boss 4 Telugu Grand Finale: మరోసారి బాస్ బిగ్ బాస్ లోకి రానున్నాడా….
1 min read
Chiru In Biggboss Photo: Google, Twitter
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రారంభించారు. మొదట ఈ షో మొదట అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. శని, ఆదివారాల్లో మాత్రమే మంచి TRP లను రాబట్టేది. కానీ రాను రాను ఈ షో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతూ వచ్చింది.
అప్పుడే బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. వచ్చే ఆదివారం బిగ్ బాస్ 4 ఫినాలే జరగనుంది. అయితే ఈ సీజన్ 4 లో గెస్ట్ ఎవరు రాబోతున్నారు, విజేతకు ట్రోఫీ ని ఎవరు ఇవ్వనున్నారు అనే దాని గురించి చాలానే చర్చలు జరిగాయి. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి ఆయనే స్వయంగా విజేతకి ట్రోఫీ ని అందించారు.
నాని హోస్ట్ గా ఉన్న రెండవ సీజన్ లో విక్టరీ వెంకటేష్ విజేతకి ట్రోఫీ ని అందించాడు. మూడవ సీజన్ లో నాగార్జున హోస్ట్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి విజేతకి ట్రోఫీ ని అందిచారు. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ విజేతకు ఎవరు ట్రోఫీ ని అందివ్వనున్నారని చర్చ జరుగుతోంది.
మొదట జూ.ఎన్టీఆర్ , మహేష్ బాబు పేర్లు వినబడ్డాయి. మిగతా హీరోలను సంప్రదించినా వారు షూటింగ్స్ తో బిజీ ఉండటంతో మరోసారి మెగాస్టార్ చిరంజేవి సీజన్ 4 కి కూడా విజేతకి ట్రోఫీ ని అందివ్వనున్నారు. ఇటు నాగార్జున తో అటు మా టివీ తో మంచి అనుబంధం ఉన్న కారణంగా చిరంజీవి దీనికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఈ బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ని చాలా గ్రాండ్ గా చేయడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం జరిగే ఫినాలే ఏకంగా 3 గంటల పాటు గ్రాండ్ గా నిర్వహించనున్నారని తెలుస్తోంది.
