దేశంలో ఆశ్చర్యకరంగా కరోనా కేసులు, Corona cases in india
1 min read
Corona cases in india
దేశంలో కరోనా వృద్ధి రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది . రోజువారి కరోనా కేసులు ఆరు నెలల కష్టానికి పడిపోయాయి. క్రితం రోజునే మరణాలు కూడా ఆరు నెలల తరువాత 300 దిగువకు నమోదైన విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం, కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. దాదాపు నెలరోజుల నుంచి రోజువారీ రికవరీలు కొత్త కేసుల కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. ఇక దేశంలో మొత్తం కేసులు ఒక కోటి ఒక లక్ష 87 వేలకు చేరాయి. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 97.61 లక్షలుగా ఉంది .
శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,732 మందికి వైరస్ సోకింది . మొత్తం కేసుల సంఖ్య 1,01,87,850 కి చేరింది . దాదాపు గత ఆరు నెలల వ్యవధిలో 19 వేల దికువకు కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. జులై 1 వ తేదీన 18,653 మందికి పాజిటివ్ వచ్చింది. 24 గంటల్లో మరో 279 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,47,622 కు పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.44 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. కొవిడ్ 19 తో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తుంది. గత 24 గంటల్లో 21,430 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త రికవరీలతో కలిపి ఆదివారం ఉదయం నాటికి 97,61,538 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు . జాతీయ రికవరీ రేటు 95.82 శాతానికి ఎగబాకింది . ఇక యాక్టివ్ కేసుల సంఖ్య వరుసగా ఆరవ రోజు కూడా మూడు లక్షలకు దిగువనే నమోదైంది. ప్రస్తుతం దేశంలో 2,78,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 2.78 శాతమని మంత్రిత్వశాఖ పేర్కొంది .
భారత్ లో ఆగస్టు 7 న కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటగా , ఆగస్టు 23 నాటికి 30 లక్షలు , సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకోగా , సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షలు , సెప్టెంబర్ 28 న ఆ సంఖ్య 60 లక్షలు దాటింది . అక్టోబర్ 11 నాటికి 70 లక్షలు , అక్టోబర్ 29 నాటికి 80 లక్షలు దాటాయి . నవంబర్ 20 న 90 లక్షల మ్కాను దాటాయి. డిసెంబర్ 19 న కోటి మార్కును దాటేశాయి . అయితే దేశంలో లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం పట్టగా , అవి 59 రోజుల్లో 10 లక్షలకు చేరాయి . దేశంలో ఇప్పటివరకు 16,81,02,657 కోట్ల శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తి చేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి ( ఐసిఎం ఆర్ ) వెల్లడించింది. శనివారం 9,43,368 పరీక్షలు నిర్వహించి నట్లు తెలిపింది .
కొత్తగా సంభవించిన 279 మరణాల్లో మహారాష్ట్రలో 60 మంది , ఢిల్లీలో 23 మంది , పశ్చిమబెంగాల్ లో 33 , కేరళలో 21 , ఉత్తరప్రదేశ్ లో 14 , ఉత్తరాఖండ్ లో 13 , పంజాబ్ లో 12 , ఛత్తీస్ గ్ ఢ్ లో 12 మంది మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది . దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 1,47,622 మంది మృత్యువాత పడగా , ఒక్క మహారాష్ట్రలోనే 49,189 మంది బల య్యారు . తమిళనాడులో 12,059 , కర్నాటకలో 12,051 , ఢిల్లీలో 10,437 , పశ్చిమ బెంగాల్ లో 9,569 , ఉత్తరప్రదేశ్ లో 8,293 , ఆంధ్రప్రదేశ్ లో 7,092 , పంజాబ్ లో 5,281 మంది , గుజరాత్ లో 4,275 మంది కొవిడ్ కారణంగా మృతి చెందినట్లు మంత్రిత్వ శాఖ గణాంకాల ద్వారా వెల్లడయింది . ఇదిలా ఉండగా , ఇటీవలి కాలంగా కేరళలో దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదైవుతున్నాయి . గడిచిన 24 గంటల్లో కేరళలో 3,527 , మహారాష్ట్రలో 2,854 , పశ్చిమ బెంగాల్ లో 1,253 , తమిళనాడులో 1,019 , ఉత్త రప్రదేశ్ లో 1,098 మందికి పాజిటివ్ వచ్చింది .
