May 12, 2025

Digital Mixture

Information Portal

అమజాన్ ప్రైమ్ లో ది ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ రిలీజ్ డేట్ వచ్చేసింది…The Family Man season 2 on Amazon Prime

1 min read
The Family Man Season 2

The Family Man Season 2 Photo:Twitter / @PrimeVideoIN

రెండవ సీజన్ లో సమంత అక్కినేని

అమెజాన్ ప్రైమ్ లో 20 19 లో భారీ సక్సెస్ సాధించిన వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి  ఇందులో నటించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సీరిస్ లో మనోజ్ బాజ్‌పేయి ఒక ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా, మరియు వ్యక్తిగత జీవితంలో వచ్చే సమస్యలను ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నదే కథాంశంగా ఎంచుకున్నారు. శ్రీకాంత్ తివారీ గా మనోజ్ బాజ్‌పేయి నటన అత్భుతం అని చెప్పొచ్చు.

దీనికి సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో ఈ వెబ్ సీరిస్ 2 వ సీజన్ ఎపుడు అనే దాని గురుంచి చర్చలు జరిపారు. దానికోసం గూగల్ లో కూడా ఎక్కువగా వెతకడం జరిగింది. అయితే  ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరిస్ ఎప్పుడు రాబోతుందో మేకర్స్ ప్రకటించారు. దర్శకులు రాజ్ మరియు డికే ఒక ప్రకటనలో మాట్లాడుతూ ది ఫ్యామిలీ మ్యాన్ 2  వెబ్ సీరిస్ కోసం అభిమానులు చాలా రోజులనుండి ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 12 వ తేదీన ఈ 2 వ సీరిస్ ని అమెజాన్ ప్రైమ్ ద్వారా మన ముందుకు తీసుకు రాబోతున్నట్టు ప్రకటించారు.  

The Family Man season 2 on Amazon Prime, The Family Man, Amazon Prime, The Family Man Season 2,
Tha Family Man 1 Photo: Twitter / @PrimeVideoIN

ఈ రెండవ సీజన్ లో తెలుగు స్టార్ హీరోయిన్  సమంత అక్కినేని నటిస్తుండటం విశేషం. దర్శకులు మాట్లాడుతూ ఈ సీజన్ లో నటించమని తనని అడిగినప్పుడు తన పాత్ర గురించి  విన్నాక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నందుకు సమంత అక్కినేనికి ధన్యవాదాలు తెలియజేసారు. కరోనా సమయంలో ఈ రెండవ సీజన్ పూర్తి కావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు  తెలియజేసారు.  

మొదటి సీజన్ లో నటించిన ప్రధాన పాత్రదారులు సీజన్ 2 లో కూడా కొనసాగడం జరుగుతోంది. తెలుగు స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తో ఈ వెబ్ సీరిస్ కి అదనపు కొత్తదనం తోడైనదని చెప్పొచ్చు.

సమంతా అక్కినేని, మనోజ్ బాజ్‌పేయిలతో పాటు, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో ప్రియమణి, షరీబ్ హష్మి, సీమా బిస్వాస్, దర్శన్ కుమార్, శరద్ కేల్కర్, సన్నీ హిందూజా, శ్రేయా ధన్వంతరి, షాహాబ్ అలీ, వేదాంత్ సిన్హా, మహేక్ ఠాకూర్‌లు ఈ రెండవ సీజన్ లో నటించనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *