భారత్ లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్
1 min read
భారత్ లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కరోజే 40 వేలకు చేరువులో రికార్డు అయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 4 వేల కేసులు అధికంగా వెలుగు చూశాయి. 110 రోజుల తరువాత ఈ స్థాయిలో కేసులు వస్తుండడం కలవర పెడుతోంది. రోజువారీ మరణాలు కూడా గత కొన్ని రోజుల నుంచి నిత్యం 150 కి తగ్గడం లేదు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో 39,726 మందికి పాజిటివ్ వచ్చింది. 110 రోజుల క్రితం కూడా 39,726 కేసులు నమోద య్యాయి. అయితే గత ఏడాది నవంబర్ 29 న 41,810 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా కారణంగా మరో 154 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,59,370 కి చేరింది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుం డడంతో వరుసగా 9 వ రోజూ యాక్టివ్ కేసులు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 2,71,282 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రితం రోజు కంటే దాదాపు 18,918 వేలు అధికం. మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 2.36 శాతంగా ఉంది. జాతీయ రికవరీ రేటు 96.26 శాతానికి పడిపోయినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 20,654 మంది వైరస్ నుంచి బయట పడగా , రికవరీ సంఖ్య 1,10 , 83,679 కి పెరిగింది . అయితే మరణాల రేటు 1.38 శాతానికి దిగజారింది . ఇప్పటి వరకు దేశంలో 23,13,70,546 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది . గురు వారం ఒక్కరోజే 10,57,383 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది .
మహారాష్ట్ర , పంజాబ్ , కర్నాటక , గుజరాత్ భారీగా కొత్త పాజిటిన్లు వచ్చాయి . కొత్త కేసుల్లో 80 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదైనట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది . మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి . 24 గంటల్లో 25,833 ( 65 శాతం ) , పంజాబ్లో 2,369 , , కేరళలో 1,899 కేసులు నమోదయ్యాయి . అయితే నిత్యం 8 రాష్ట్రాలు మహారాష్ట్ర, తమమిళనాడు, పంజాబ్, మధ్య ప్రదేశ్, ఢిల్లీ, గుజారత్, కర్నాటకలో, హర్యానా లో భారీగా రోజువారీ కేసులు రికార్డు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. కొత్తగా సంభవించిన 154 మరణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 58 మంది మృతి చెందగా, పంజాబ్ 32, కేరళలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 రాష్ట్రాలు, యుటిల్లో ఒక్క రోజు వ్యవధిలో ఎలాంటి మరణాలు సంభవించలేదు.
శరవేగంగా టీకాల పంపిణీ… భారత్ లో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతోంది. దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులకు టీకాలు వేశాయి. ఇప్పటి వరకు 6,47,480 సెషన్లలో 3,93,39,817 మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. అందులో 76,35 , 188 మంది ఆరోగ్య కార్యకర్తలు, 78,33,278 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోస్ తీసుకోగా, 47 , 15,173 మంది ఆరోగ్య కార్యకర్తలు, 21,98,414 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు రెండవ డోస్ తీసుకున్నారు. వీరే కాకుండా 45 ఏళ్ల దాటి దీర్ఘకాలిక వ్యాధుల గల వారు 27,79,998 మంది, 60 ఏళ్ల దాటిన వృద్ధులు 1,41,77,766 మంది మొదటి డోస్ తీసుకున్నారు. కాగా జనవరి 16 వ తేదీన ప్రారంభమైన వ్యాక్సిన్ పంపిణీ జావుగా సాగుతోంది. 62 రోజైన మార్చి 18 న 22,02,861 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేశారు.
