జమ్మూ లో మరొక తిరుపతి…, త్వరలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం…
1 min read
Ttd In Jammu
ఇకపై భక్తులు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని జమ్ము లో కూడా దర్శించుకోవచ్చు. ఇది నిజమేనండి. జమ్ము- కశ్మీర్ పరిపాలన మండలి శ్రీవారి ఆలయానికి 62.02 ఎకరాల భూమిని ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మజీన్ అనే గ్రామలో ఈ భూమిని కేటాయించింది. ఈ భూమిని 40 సంవత్సరాల లీజుకు ఇవ్వడం జరిగంది.
మాతా వైష్ణోదేవి ఆలయం, అమర్ నాథ్ క్షేత్రాలతో జమ్ము పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ బాలాజీ గా పిలుచుకొనే తిరుపతి శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగితే జమ్ము పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనితో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని అక్కడి నాయకులు చెబుతున్నారు.
ఆలయ నిర్మాణంతో పాటు, ఆలయ అనుబంధ మౌలిక సదుపాయాలను కూడా కల్పించనుంది. తిరుపతిలో తరహా వేదం పాఠశాల, ధ్యాన కేంద్రం, దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఉండడానికి క్వార్టర్స్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనుంది. ప్రస్తుతానికి 40 సంవత్సరాల కాలానికి లీజుకు ప్రతిపాదనకు జమ్ము-కాశ్మీర్ పరిపాలక మండలి ఆమోదం తెలిపింది.
ఇకపై తిరుపతి కి రాలేకఇబ్బంది పడే నార్త్ ఇండియా భక్తులు వారికి ఇష్ట దైవమైన బాలాజీని జమ్ము లోనే దర్శించుకోవచ్చు.
