సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి…
1 min read
Mahesh Babu, Krithi Shetty
“ఉప్పెన” సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయమైన హీరోయిన్ కృతీ శెట్టి. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే టాప్ దర్శకులు, నిర్మాతలు తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. అందుకే తన మొదటి సినిమా “ఉప్పెన” సినిమా విడుదల అవ్వకముందే తనకు అవకాశాలు ఉప్పెనలా వచ్చాయి, వస్తున్నాయి. ఎందుకంటే ఉప్పెన సినిమా విడుదలకు ముందే ఈ భామ నాచురల్ స్టార్ నాని సరసన శ్యాం సింగ్ రాయ్ సినిమాతో పాటు సుదీర్ బాబు సినిమాలో కూడా చేయనుంది.
అయితే ఇప్పుడు ఈ కన్నడ భామ మరో లక్కీ చాన్స్ కొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరుశరాం దర్శకత్వంలో “సర్కారువారి పాట” సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత రాజమౌళి తో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి తో సినిమా సెట్స్ మీదికి వెళ్ళే లోపే “సరిలేరు నీకెవ్వరు” తో మంచి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నట్టు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఉప్పెన భామ కృతీ శెట్టి ని తీసుకోనున్నట్టు సమాచారం. ఇది నిజమైతే అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే లక్కీ చాన్స్ దక్కినట్టు అవుతుంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో విక్టరీ వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్, మెహ్రీన్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే సినిమా మొదలు కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నారని ఇండస్ట్రీ లో టాక్.
