శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు సెబి షాక్…
1 min read
Shilpa Shetty Raj Kundra
శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అవ్వడంతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురైందని చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రితం పోర్న్ వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ని అరెస్ట్ చేసారు. ఇప్పడు తాజాగా సెబి నుండి షాక్ తగిలిందని చెప్పొచ్చు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు సెబి రూ.3 లక్షలు జరిమానా విధించింది. సెబి (Securities and Exchange Board of India) నిబంధనలను ఉల్లంగించినందుకు ఈ జరిమానా విధించినట్టు తెలుస్తోంది.

ముంబై కి చెందిన గహనా వశిష్ట్ అనే నటి అరెస్ట్ తో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పోర్న్ వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో గహనా వశిష్ట్ తో పాటు మరో 10 మందిని ముంబై పోలీసులు అరెస్టు చేసారు. బెయిల్ పై బయటికి వచ్చిన వాళ్ళను విచారించగ మరికొన్ని నిజాలు బయటపడటంతో ముంబై పోలీసులు రాజ్ కుంద్రా ని ఈ నెల 19 న అరెస్ట్ చేసారు, తాజాగా ముంబై కి చెందిన ఓ నటి తమతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో రాజ్ కుంద్రా కి సంబందించిన మరో నలుగురిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోర్న్ సినిమాల తయారీ, ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రూ. కోట్లు ఆర్జించినట్టు ముంబై పోలీసులు కోర్టుకు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
