Toky02020:యావత్ భారతావని గర్వపడిన వేళ… స్వర్ణ పతాకం ముద్దాడిన నీరజ్ చోప్రా భళా…
1 min read
Neeraj Chopra
వందేళ్ళ భారతావని కలని ఈ యువ ఆటగాడు నిజం చేసాడు. అఖండ భారతావనిని ఆనందంలో ముంచెత్తాడు. అతడే మన నీరజ్ చోప్రా. ప్రతిష్టాత్మక టోక్యో ఒలంపిక్స్ లో జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ రోజు జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి అఖండ భారతావని గర్వించేలా స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్నాడు. అథ్లెటిక్స్ లో భారత్ కి స్వర్ణ పతాకాన్ని అందించిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా వ్యక్తిగత క్రీడా విభాగంలో స్వర్ణం సాధించిన రెండో భారతీయుడిగా చరిత్ర కెక్కాడు. నీరజ్ చోప్రా కన్నా ముందు షూటింగ్‌లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని సాధించాడు.
యావత్ భారతదేశం ఎంతోకాలంగా ఎదుచూస్తున్న స్వర్ణ పతాకం ఈరోజు మనను వరించింది. భారత కీర్తి పతాకం అతున్నత శిఖరాన రెపరెప లాడుతున్న వేళ ఇది. నీరజ్ చోప్రా స్వర్ణంతో టోక్యో ఒలంపిక్స్ లో భారత్ తన ప్రస్థానాన్ని ఘనంగా ముగుంచింది. ఒలింపిక్స్‌కు ఆదివారం చివరి రోజు అయినప్పటీకీ భారత్ అథ్లెట్ల పోటీకి మాత్రం శనివారమే చివరి రోజు. నీరజ్ చోప్రా స్వర్ణం తో భారత్ మొత్తం 7 పతకాలు సాధించింది. చివరి రోజు భారత్ కి రెండు పతకాలు రావడం విశేషం. రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా కంచు.. నీరజ్ చోప్రా స్వర్ణంతో భారతావని ఆనందంలో ముంచెత్తారు.
