#Tokyo 2020: ఒలంపిక్స్ విజేతలకు జీవితకాలం పాటు ఉచిత విమాన ప్రయాణం…
1 min read
Tokyo 2020
టోక్యో ఒలంపిక్స్ లో పతకాలు సాధించిన మన దేశ ఆటగాళ్లకు ప్రభుత్వం తో పాటు, ప్రైవేటు రంగాల ప్రముఖులు ప్రశంసలతో పాటు వివిధ రకాల బహుమతులు ప్రకటిస్తూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా టోక్యో ఒలపిక్స్ లో పతకాలు సాధించిన విజేతలందరూ తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది.
దేశీయ విమాన సంస్థలైన స్టార్ ఎయిర్, గో ఫస్ట్, పతకాలు సాధించిన విజేతలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే స్టార్ ఎయిర్ విజేతలకు జీవిత కాలం ఉచిత టికెట్లు ఇస్తామని ప్రకటించగా, గో ఫస్ట్ ఐదేళ్ళ పాటు ఉచిత ప్రయాణ సేవలు అందజేస్తామని ప్రకటించింది.
అయితే ఇండిగో సంస్థ, దేశానికి స్వర్ణాన్ని అందించన నీరజ్ చోప్రాకి సంవత్సరం పాటు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
