IPL 2023:వెంకటేష్ అయ్యర్ అత్భుత ఇన్నిగ్స్… హిరో ఆఫ్ ది మ్యాచ్ రింకు సింగ్… చివరి ఓవర్లో వరుసగా 5 సిక్సులు…
1 min read
GT Vs KKR
KKR విజయాన్ని అడ్డుకోలేని రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్స్…
IPL 2023 లో అత్బుతమైన మ్యాచుల్లో ఈ మ్యాచ్ మొదటి స్థానంలో నిలుస్తుంది.
ఓడిపోతారనుకున్న మ్యాచ్ ని ఒంటిచేత్తో గెలిపించిన రింకు సింగ్.
ఈ రోజు జరిగిన GT vs KKR మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ అత్భుతమైన ఆటను ప్రదర్శించాడు. 83 పరుగులతో గుజరాత్ బౌలర్లపై విరుచుక పడ్డాడు. కెప్టైన్ నితీష్ రానా తో కలిసి జట్టుని జట్టుని ముందుకు తీసుకెళ్ళాడు. నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్ అవుటవ్వగానే మ్యాచ్ మొత్తం గుజరాత్ వైపు మళ్ళింది. వరుసగా KKR వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో KKR ఓటమి తప్పదని KKRటీం తో సహా అందరూ భావించారు. అదే విధంగా రన్ రేట్ భారీగా పెరుగుతూ వస్తోంది.
19 ఓవర్లు ముగుసే సమయానికి KKR 176 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. క్రీజులో రింకు సింగ్, ఉమేష్ యాదవ్ ఉన్నారు. ఇంకా 6 బంతుల్లో 29 పరుగులు చేయాల్సివుంది. ఇలాంటి సందర్భంలో ఎవరైనా KKR విజయం కష్టమే అని భావిస్తారు. మొదటి బంతికి ఒక అరుగు రాగా, మిగతా 5 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉంది. రింకు సింగ్ బ్యాటింగ్ చేస్తుండగా యష్ దయాల్ బౌలింగ్ చేస్తున్నాడు. అలా దయాల్ వేసిన 5 బంతులను సిక్సర్లగా మలిచి KKR కి ఊహించని,మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందించాడు. రింకు సింగ్ 21 బంతులాడి 48 పరుగులు చేసాడు. అందులో 1 ఫోర్ మరియు 6 సిక్స్ లు ఉన్నాయి.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 204 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. విజయ్ శంకర్ తో పాటు సాయి సుదర్శన్ అత్భుత బ్యాటింగ్ తో KKR ముందు భారీ స్కోరును ఉంచారు. సాయి సుదర్శన్ 53, విజయ్ శంకర్ 63 పరుగులు చేసారు.
