May 12, 2025

Digital Mixture

Information Portal

గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు…

1 min read
Rcb Vs Csk, IPL T20 2023

Rcb Vs Csk IPL T20 2023

Faf du Plessis, Glen Maxwell శ్రమ వృధా…

CSK 8 పరుగుల తేడాతో విజయం…

ఐపిల్ T20 లో భాగంగా ఈరోజు బెంగళూర్ చిన్న స్వామి మైదానంలో  RCB vs CSK మధ్య జరిగిన మ్యాచ్ లో CSK 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 227 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు మొదట 12 ఓవర్ల వరకు మ్యాచ్ మొత్తం RCB వైపుగా అనిపించింది. ఎందుకంటే అప్పటివరకు క్రీజులో ఉన్న Faf du Plessis మరియు Glen Maxwell  స్కోరును బౌండరీలతో పరిగెత్తిస్తున్నారు. అప్పుడే Glen Maxwell  72 పరుగుల వద్ద అవుటయ్యాడు. మరో 18 పరుగుల తేడాతో కెప్టైన్ Faf du Plessis కూడా అవుటవ్వడంతో మ్యాచ్ కొంత వరకు CSK చేతిలోకి వెళ్ళింది. కానీ దినేష్ కార్తిక్ కూడా కొంత దూకుడుగా ఆడటంతో RCB విజయం మీద ఆశలు పెట్టుకుంది. ఇంతలో దినేష్ కార్తీక్ అవుటవ్వడంతో మ్యాచ్ పూర్తిగా CSK చేతిలోకి వెళ్ళింది. ఒత్తిడిలో RCB వరుసగా వికెట్లను కోల్పోయింది. చివరగా 6 బంతుల్లో 19 పరుగులు కావాల్సి ఉండగా 10 పరుగులు మాత్రమే చేయడంతో CSK 8 పరుగుల తేడాతో RCB పై విజయం సాధించింది. CSK బౌలర్స్ లో Tushar Deshpande (3), Matheesha Pathirana (2) వికెట్లను తీసారు.

మొదట బ్యాటింగ్ చేసిన CSK దూకుడుగా ఆడటంతో RCB ముందు 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. CSK బ్యాటింగ్ లో Devon Conway ( 83 ), Ajinkya Rahane ( 37), Shivam Dube (52)  పరుగులు చేయడంతో చెన్నై 6 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరును బెంగళూరు ముందుంచింది.  RCB  వేసిన ప్రతీ బౌలరు ఒక వికెట్ చొప్పున తీసుకున్నారు.

83  పరుగులు చేసిన Devon Conway (CSK) కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *