బింబిసార దర్శకుడితో మెగాస్టార్ చిరంజీవి….
1 min read
Megastar new Movie
ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాల దూకుడు మామూలుగా లేదు. రీసెంట్ గా వాల్తేరు వీరయ్యతో మాంచి ఫామ్ లో ఉన్న మెగాస్టార్, ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత సినిమా ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు. ఆ మధ్య భీష్మ ఫేమ్ వెంకి కుడుముల తో సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని చిరు పక్కకు పెట్టారని అర్ధమైంది. ఎందుకంటే వెంకి కుడుముల తన భీష్మ హీరో, హీరోయిన్లతో కొత్త సినిమాని ప్రకటించారు. విశేషం ఏమిటంటే దానికి మెగాస్టార్ చిరంజీవి ప్రారంభ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది.
అయితే చిరంజీవి మాత్రం వరుసగా ఖాళీ సమయాల్లో చాలా కథలు వింటున్నట్టు తెలుస్తోంది. కానీ ఇంకా ఏది ఫైనల్ చేసారు అన్నది బయటికి రానివ్వట్లేదు. ఈమధ్య చిరంజీవి తెలిసో తెలియకో కొన్ని విషయాలను తొందరపడి బయటికి చెప్పేస్తున్నారు. అది కొన్ని సార్లు బెడిసికొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఆచార్య సినిమా నుండి మొదలైందని తెలుస్తోంది. అందుకే ఏ విషయాలు బయటికి రావట్లేదని ఇండస్ట్రీలో టాక్. అయితే చిరు నెక్స్ట్ మూవీ గురించి ఇంకొక కొత్త విషయం ఇండస్ట్రీ నుండి బయటికి వొచ్చింది. అదే చిరు తరువాత సినిమా బింబిసార దర్శకుడు వశిష్ట తో చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
బింబిసారతో కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు వశిష్ట. అయితే బింబిసార పార్ట్ 2 కూడా రాబోతుందని దర్శకుడు వశిష్ట ప్రకటించినా అది కూని కారణాల వల్ల ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది. బింబిసార చూసిన బాలకృష్ణ కూడా తనతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ బాలయ్య ముందే ఒప్పుకున్న సినిమాలతో బిజీగా ఉన్నాడు. దానితో వశిష్ట వేరే హీరోలను సంప్రదించడంలో భాగంగా చిరంజీవితో అవకాశాన్ని కొట్టేసాడానే వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పండగనే చెప్పొచ్చు. ఎందుకంటే తన అభిమాన హీరోని న్యూ జనరేషన్ డైరెక్షన్ లో చూడాలనుకుంటారు. ఎందుకంటే కొత్త డైరెక్టర్లు తమ హీరోని కొత్తగా చూపిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతోందో అని అప్పుడే మెగాస్టార్ అభిమానులు ఫాంటసీ కథలను ఉహించుకుంటున్నారు.
కానీ అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు మనకు ఆగాల్సిందే.
