బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న డైరెక్టర్ వి.వి. వినాయక్… హీరో ఎవరో తెలుసా…!
1 min read
V.V.Vinayak, Image Source: Google
వి.వి.వినాయక్, ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరేమో. ఎందుకంటే ఈయన మాస్ సినిమాలకు పెట్టింది పేరు. తరువాత కొంచెం ట్రాక్ మార్చి మాస్, కామెడీ మిక్స్ చేసి సినిమాలు తీసి విజయం సాధించాడు. మెగాస్టార్ చిరంజీవి తో రెండు సినిమాలకు దర్శకత్వం వహించి చిరుకి మంచి హిట్స్ అందించాడు.
ఈ మద్య లూసిఫర్ రీమేక్ కి కూడా వినాయక్ పేరు పరిశీలనలకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితుల్లో అది వర్కవుట్ కాలేదు. ఒకప్పుడు మాస్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో స్టార్ హీరోలంఅవకాశాలు తగ్గిపోయాయిదరితో సినిమాలు తీసాడు. కానీ ఇప్పుడున్న హీరోలంతా కొత్తవారికి అవకాశాలు ఇస్తుండటంతో వినాయక్ కి అవకాశాలు తగ్గిపోయాయి. దీనితో మద్యలో వినాయక్ తనలో కొత్త కోణాన్ని పరీక్షించుకోవడానికి హీరోగా సీనయ్య పేరుతో సినిమా చేసాడు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదనుకోండి.
అయితే అసలు విషయానికొస్తే, వినాయక్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగు లో భారీ విజయం సాధించిన, రాజమౌళి, రెబల్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. దీనికి రంగం సిద్దమైంది. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాని నిర్మించబోతున్నారు.

అయితే ఇక్కడ హీరోగా తెలుగులో అల్లుడు శ్రీను తో పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్, ఛత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే మొదట సాహో ఫేం సుజిత్ ని చేయమని అడిగితే తాను వేరే సినిమా కి కమిట్ అవ్వడంతో ఈ సినిమా కి ఒప్పుకోలేదు.
అయితే ఇక్కడ ఒకటి గమనిచవచ్చు, బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసింది కూడా వి.వి.వినాయక్. మళ్ళీ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ వి.వి.వినాయక్ తో అవుతుండటం విశేషం.
