చైనాకు మరో షాక్… రూ.900 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న హీరో సైకిల్స్ …..
1 min read
చైనాకు మరో షాక్… రూ.900 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న హీరో సైకిల్స్ …..
ఇప్పుడు భారత్ – చైనా ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దానిలో భాగంగా మోడీ ప్రభుత్వం చైనా దూకుడుకి కళ్ళెం వేస్తూ వస్తోంది. అందుకు గాను డ్రాగన్ దేశానికి సంబంధించిన 59 యాప్స్ ని బాన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో టిక్ టాక్ కూడా ఉంది. భారత్ లో టిక్ టాక్ బాన్ చేయడం వల్ల చైనాకు భారీ నష్టం వాటిల్లినట్టు రిపోర్ట్స్ చెపుతున్నాయి. సోషల్ మీడియాలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ఒక ఉద్యమం నడుస్తోంది. మరికొందరు చైనా వస్తువులు కొనడం మానేశారు. ఇలా ఎదో రకంగా చైనా దూకుడుకి ఆర్ధికంగా కళ్ళెం వేస్తున్నారు.

ఇప్పుడు హీరో సైకిల్స్ సంస్థ చైర్మన్ పంకజ్ ముంజల్ సంచలన ప్రకటన్ చేసారు. చైనాతో కుదుర్చుకున్న రూ. 900 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. 3 నెలల్లో రూ. 900 కోట్ల బిజినెస్ ని చేయాల్సిన ఒప్పందాని రద్దు చేసుకుంటున్నామని వెల్లడించారు. తాము భారత్ లో 72 శాతం వాటా కలిగి ఉన్నామని, త్వరలో హీరో ఎలక్ట్రో ఇ-సైకిల్ ని ప్రారంభిస్తున్నామని పంకజ్ ముంజల్ వెల్లడించారు.
