Dharani Portal: పత్రాలతో వచ్చి ఈ – పాస్ బుక్ తో వెళ్ళిన రైతు
1 min read
పత్రాలతో వచ్చి ఈ - పాసు తో వెళ్ళిన రైతు
మేడ్చల్ జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా ఈ-పట్టా పాస్ బుక్ పొందిన రఘుపతిరెడ్డి.
పేరు కట్ల రఘుపతిరెడ్డి . రంగారెడ్డి జిల్లా చందానగర్ వాసి . మేడ్చల్ మల్కాజి గిరి జిల్లా శామీర్‌పేట మండలం లాల్ గడి మలకపేట గ్రామ రెవెన్యూ పరిధి లోని సర్వేనంబర్ 336 లో సాయి ప్రియాంక పేరిట ఉన్న సుమారు 10 గుంటల భూమిని కొనాలని నిర్ణయిం చుకున్నాడు. రిజిస్ట్రేషన్ కోసం సోమవారం ఉదయం 11 గంటలకు స్లాట్ బుక్ చేసుకున్నాడు . సాయి ప్రియాంక , రఘుపతిరెడ్డి ఇద్దరూ శామీర్ పేట సబ్ రిజి స్ట్రార్ , తాసిల్దార్ కార్యాలయానికి వచ్చారు. డాక్యుమెంట్లను అధికారులకు అప్పగించారు. ఆన్లైన్ లో స్టాంపు డ్యూటీ చెల్లిం చారు. డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు .. క్రయ విక్రయ దారులతోపాటు సాక్షుల బయోమెట్రిక్ ను స్వీకరించారు. డాక్యుమెంట్ ను రిజిస్ట్రేషన్‌కు సిఫారసు చేశారు .
శామీర్ పేట తాసిల్దార్ సురేందర్ రిజిస్ట్రేషన్ చేసి సాయి ప్రియాంక పాలు లోని 10 గుంటల భూమిని తొలిగించి , రఘుపతిరెడ్డి పేర నమోదుచేశారు . కొత్త పట్టాదారు పాస్బుక్ కోసం సిఫారసు చేశారు . పట్టాదారు పాస్ పుస్తకం , భూమి ఖాతా నంబర్లతో సహా ఆన్లైన్ లో జనరేట్ అయిన ఈ – పట్టాదారు పాస్పుకన్ను ఆర్డీవో రవి సమక్షంలో రఘపతిరెడ్డికి ( డిజిటల్ పట్టాదారు పాస్బుక్ లేని కారణంగా ఈ – పట్టాదారు పాస్బుక్ ) అందిం చారు .
ఈ ప్రక్రియ అంతా కేవలం 15-20 నిముషాల వ్యవ ధిలోనే జరుగడం విశేషం . ‘ ఇంత తొందరగా రిజిస్ట్రేషన్లో పాటు పట్టాదారు పాస్బుక్ వస్తుందని ఊహించలేదు . ఉదయం వేరేవారి పేర ఉన్న భూమి అరగంటల నా పేరుమీ దకు రావడం ఆనందంగా ఉన్నది . ముఖ్యమంత్రి కేసీఆర్ కు , ప్రభుత్వానికి సెల్యూట్ ‘ అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సోమవారం ధరణి ఫోర్టల్ సేవల ద్వారా తొలి పట్టాదారు పాస్ బుక్ ను అందుకున్న రఘుపతిరెడ్డి సంతోషం వ్యక్తంచేశారు
