May 12, 2025

Digital Mixture

Information Portal

ట్రంప్ పని అయిపోయినట్టేనా! US election results

1 min read
US election results, Trump, Joe Biden, US elections, బైడెన్, ట్రంప్,  జో బైడెన్

US election results

ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు  US election results  కోసం ఎదురు  చూస్తున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ తరువాత జరిగే పరిణామాల గురించి అంచనాలు వేస్తున్నాయి.

అమెరికా కొన్ని కీలక రాష్ట్రాలలో తాజా ఓట్ల లెక్కింపు ప్రకారం అమెరికా అధ్యక్ష పీఠాన్ని గెలుచుకునేందుకు డెమొక్రాటిక్ నాయకుడు జో బైడెన్ (Joe Biden) మరో అడుగు ముందుకువేశారు. దాంతో ప్రస్తుత రిపబ్లికన్ అధ్యక్షుడు మళ్లీ ఎన్ని కయ్యే అవకాశాలు బాగా తగ్గిపోయినట్లుగానే కనిపిస్తోంది . బైడెన్ 264 స్థానాలను తన ఖాతాలో వేసుకున్నారు . అలా 538 ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లున్న అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీకి అవసరమైన 270 సంఖ్యకు బైడెన్ దగ్గరవుతు న్నారు . ట్రంప్ (Trump)ఆధిక్యం 16 ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లున్న జార్జియాలో 1,902 ఓట్లకు, 20 ఎలె క్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాలో 42,142 కు పడిపోయింది. మొత్తానికి 214 ఎలెక్టోరల్ ఓట్లతో ట్రంప్ మెజారిటీకి దూరంలో ఉన్నారు. “ పరిస్థితులను చూస్తుంటే మనం చాలా బాగా ఉన్నామనిపిస్తోంది.

లెక్కింపు పూర్తయ్యేసరికి సెనేటర్ ( కమలా ) హారిస్, నేను విజేతలుగా నిలుస్తామనడంలో అనుమానం లేదు ” అని బైడెన్ డెలావేర్ లో విలేకరులతో అన్నారు. అయితే లెక్కింపు కొనసాగుతోంది. కనుక అమె రికన్లు ప్రశాంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఎన్నికలలో జరిగిన అవకతవకల గురించి తాను న్యాయస్థానానికి వెళ్తానని వైట్ హౌజ్ దగ్గర జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, నెవడా రాష్ట్రాలలో ట్రంప్ బృందం ఇప్పటికే కేసులు దాఖలు చేసింది. ఇక విస్కాన్సిన్ లో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. “ ఓట్ల లెక్కింపును ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానాలకు వెళ్తున్నారు. మళ్లీ పోరా డేందుకు చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల రక్షణ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. అందు కు మీ సహకారం అవసరం ” అని ట్రంప్ వైట్ హౌజ్ వార్తల సమావేశం తర్వాత బైడెన్ ట్వీట్ చేశారు.

డెమొక్రాట్లు ప్రజాస్వామ్యాన్ని దొంగిలిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. “ ఎన్నికల సమగ్రతను పరిరక్షించడమే మన లక్ష్యం . ఇంతటి ప్రధానమైన ఎన్నికలో అలా దొంగిలించేందుకు పాల్పడే అవినీతిని మనం ఆమోదించ. ఇంకా ఎవ్వరూ మన ఓటర్ల గొంతు నొక్కకుండా, ఫలితాలను వండివార్చకుండా మనం ఎవ్వరినీ అనుమ తించం ” అని ట్రంప్ విలేకరులతో అన్నారు. “ ఇ క్కడ బ్రహ్మాండమైన వివాదం నడుస్తోంది. ఇది ఎన్నికలలో దొంగతనానికి ప్రయత్నిస్తున్న వారికి సంబంధించింది ” అని అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బైడెన్ ఖండించారు. “ మననుంచి ప్రజాస్వామ్యాన్ని ఎవ్వరూఎత్తుకు వెళ్లట్లేదు. ఇప్పు డే కాదు, ఎప్పటికీ కూడా అమెరికా చాలా దూరం ప్రయాణించింది. ఎన్నో యుద్ధాలలో పోరాడింద. పోరాడేందుకు మనకు ఎంతో ఓపిక ఉంది ” అని మరో ట్వీట్లో బైడెన్ పేర్కొన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలు తప్పన్న అమెరికా మీడియా  ద న్యూ యార్క్ టైమ్స్ ప్రకారం ట్రంప్ చేస్తున్న “ తప్పుడు ” ప్రకటనల నుంచి ప్రధాన వార్తల ఛానెళ్లయిన ఎబిసి, సిబిఎస్ , ఎబిసి అన్నీ కూడా దూరం జరిగాయి. “ నిర్ణయాత్మకమైన రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నందు వల్ల బైడెన్ దారి స్పష్టంగా కనిపిస్తోంద ” ని ద వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. “ మోసం లేదా అవినీతికి సంబం ధించి ఎలాంటి ఆధారాలూ లేవు ” ( దేర్ ఈజ్ జీరో- జీరో ఎవిడెన్స్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ కరప్షన్ ) అని వాషింగ్టన్ పోస్ట్ తన సంపాదకీయంలో వెల్లడించింది. “ ట్రంప్ అనైతికంగా భావిస్తున్నదంతా ఆయనకు బాధ కలిగించేదే అయినప్పటికీ అది సహజమే : ఆయన ఓడిపోతున్నారు. ఎన్నికల రాత్రి కొన్ని రాష్ట్రాల్లో పాక్షికమైన లెక్కింపులో ఆయన ఆధి క్యంలో కొనసాగారు. అయితే, ఈ – మెయిల్ ఓట్ల లెక్కింపు మొదలుకాగానే, ఆయన చెప్పినట్లుగానే ఆయన ఆధిక్యం తగ్గిపోయింది ” అని అది పేర్కొంది.

ఎన్నికలకు ముందు ఈ- మెయిల్ ఓటింగ్ గురించి ట్రంప్ మరీ ఎక్కువగా విమర్శిం చారు. దాంతో కొంతమంది రిపబ్లికన్లు మాత్రమే ఆయనకు ఓటువేశారు. “ అందుకే మెయిల్ బ్యాలె ట్లలో ఎక్కువగా డెమొక్రాట్ జో బైడెన్ వైపు మొగ్గు చూపాయి. అందుకే ట్రంప్ చెప్పిన అబద్ధాలకు భిన్నంగా పరిశీలకులు చూస్తుండగా, రిపబ్లికన్, డెమొక్రాటిక్ రెండు పార్టీల ఎన్నికల అధికారుల సమక్షంలో, నియమాల ప్రకారమే అధికారులు ఓట్లు లెక్కిస్తున్నారు ” అని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది.

ఇక ఇండియా విషయానికి వస్తే, ఇండియా కూడా US election results ని ఆసక్తిగా పరిశీలిస్తోందని చెప్పొచ్చు. కరోనా సమయంలో భారత్, అమెరికా మద్య సంబంధాలు కొంత వరకు అనుకూలంగా మారాయని చెప్పొచ్చు. అయితే  ఈ ఫలితాల తరువాత భారత్ , అమెరికా మద్య సంబంధాలలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేదానికోసం  వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *