రంగంలోకి దిగిన అన్న హజరే, అయోమయోం లో బీజేపీ, Anna Hazare comments on Farmers laws
1 min read
Anna Hazare comments on Farmers laws
న్యూఢిల్లీ : తాను మళ్లీ నిరాహారదీక్ష చేస్తానని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. రైతులకు సంబంధించిన సమస్యలపై తన డిమాండ్లను వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుం టే నిరాహారదీక్ష చేస్తానని, అదే తన చివరి నిరసన అని ఆయన పేర్కొన్నారు. మహా రాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని తన సొంత గ్రామమైన రాలేగాన్ సిద్ధిలో ఆదివారం అన్నా హజారే విలేకరులతో మాట్లాడారు . గత మూడేళ్ల నుంచి రైతుల సమస్యలపై తాను నిరసన తెలియజేస్తూనే ఉన్నానని , అయినప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు .
ప్రభుత్వం కేవలం శుష్క వాగ్దానాలే ఇస్తుందని , అందువల్ల దానిపై తనకు విశ్వాసం లేదన్నారు. తన డిమాండ్లపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దామన్నారు. సమస్యల పరిష్కారానికి నెల సమయం ఇవ్వాలని అడిగారని , దీంతో జనవరి చివరి నాటికి ప్రభుత్వానికి గడువిచ్చినట్లు అన్నా హజారే వెల్లడించారు. ఒకవేల ప్రభుత్వం తన డిమాండ్లను నేరవేర్చకుంటే తాను మళ్లీ నిరాహారదీక్షక చేస్తానని , ఇదే తన చివరి నిరసన అని 83 ఏళ్ల సామా జిక కార్యకర్త హెచ్చరించార. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు , వ్యవసాయ ఖర్చులు , ధరల కమిషన్ ( సిఎసిపి ) కు స్వయంప్రతిప త్తిని కల్పించడం వంటి తన డిమాండ్లను అంగీకరించకుంటే నిరాహారదీక్ష చేస్తానని ఈ నెల 14 న కేంద్ర వ్యవసాయశాఖమంత్రి నరేంద్ర తోమరు హజారే లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఈ నెల 8 న భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో , వారికి మద్దతు తెలుపుతూ హజారే ఆ రోజు దీక్ష చేశారు. కాగా , సీనియర్ బిజెపి నేత , మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ హరిబాబు బగాడే ఇటీవల హజారేతో సమావేశమయ్యారు. కేంద్ర తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు . ఇదిలా ఉండగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెలకుపైగా రోజుల నుంచి రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు .
