May 12, 2025

Digital Mixture

Information Portal

వరంగల్ ప్రజలకు కేటీఆర్ శుభవార్త, Good news for Warangal people

1 min read
Good news for warangal people

KTR

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అతి పెద్ద పట్టణం అయిన వరంగల్ నగరంలో ప్రస్తుత మరియు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నియో మెట్రో రైల్ ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని , ఇప్పటికే నియో మెట్రో కి సంబంధించిన ప్రమాణాలను , ప్రత్యేకతలను కేంద్ర ప్రభుత్వం తుది రూపు ఇచ్చిన నేపథ్యంలో , వరంగల్ నగరానికి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు . ప్రస్తుతం వరంగల్ జనాభా దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని , 2051 నాటికి 35 లక్షల వరకు వరంగల్ జనాభా పెరిగే అవకాశం ఉందని , ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ పట్టణంలో మహారాష్ట్రలోని నాసిక్ తరహాలో నియో మెట్రో ప్రాజెక్ట్ ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు .

నాసిక్ మెట్రో కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి సహకారంతో వరంగల్ నియో మెట్రో కి సంబంధించిన డి పి ఆర్ సిద్ధం అయిందన్నారు . సుమారు 15.5 కిలోమీటర్ల ఉండే వరంగల్ మెట్రో కారిడార్ కి 1,050 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని , ఇందులో లో 20 శాతం నిధులు అంటే 210 కోట్ల రూపాయలను ఈక్విటీ లేదా గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మార్గదర్శకాలతో పురపాలికల్లో ఎన్నో పనులు రాష్ట్ర పురపాలక శాఖ తరపున రాష్ట్రంలోని పురపాలికల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్యక్రమాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు.

రాష్ట్రంలోని పురపాలికల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం సుమారు 258 కోట్ల రూపాయలతో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. వివిధ పురపాలికల్లో పేరుకుపోయిన 70 లక్షల మెట్రిక్ టన్నుల లెగసి డంపును ( ఇప్పటి వరకు ఉన్న చెత్త ) 520 కోట్ల రూపాయల ఖర్చుతో బయో మైనింగ్ మరియు రేమేడియేశన్ చేస్తున్నట్లు తెలిపారు. మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ లకు సంబంధించి ఇప్పటికే 76 పురపాలికల్లో పనులు పూర్తయ్యాయని, ఇందుకోసం సుమారు 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని 57 పురపాలికల్లో సుమారు 13,228 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టుకు నిధులు అవసరం అవుతాయని, అయితే అందులో మొదటి దశ కింద 30 పట్టణాల్లో 2828 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని యోచిస్తున్నామని తెలిపారు. ఇలా దాదాపు 3777 కోట్ల రూపాయలతో రానున్న సంవత్సరం లో వివిధ పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నామని, ఇందులో కనీసం 20 శాతం అంటే 750 కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాలని మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *