మొట్టమొదటి డ్రైవర్ లేని మెట్రో రైలు ప్రారంభం, Driverless metro rail inaugurated
1 min read
Driverless Metro
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్లో భారతదేశపు తొలి డ్రైవర్ లేని రైలును సోమవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందున్న వారిలా కాకుండా తన ప్రభుత్వం పెరుగుతున్న పట్టణీకరణను ఒక అవకాశంగా తీసుకుందని చెప్పారు మోడీ. మెట్రో రైలు సేవలు ప్రస్తుతం ఉన్న 18 నగరాల నుంచి 2025 నాటికి 25 కు పెరుగుతాయన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా మోడీ రైలుతో పాటు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును కూడా ప్రారంభించారు . కొన్ని దశాబ్దాల కిందటే పట్టణీకరణ ఊపందుకోగా, భవిష్యత్ అవసరాల మీద అంత శ్రద్ధ చూపలేదని ఆయన వాపోయారు . అరకొరగా చేసిన ప్రయత్నాలు ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు , పెరిగిన అవసరాల మధ్య అంతరాన్ని పూడ్చే బదులు అయోమయంలో పడేశాయని అన్నారు . పట్టణీకరణను సవాలుగా కాకుండా మంచి మౌలిక వసతుల నిర్మాణానికి , ప్రజల జీవితం మెరుగుదలకు ఒక అవకాశంగా చూడా లన్నారు . ఈ దిశగా తన ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రధానమంత్రి గుర్తుచేశారు . 2014 లో కేవలం 248 కిలోమీటర్లు ఉన్న మెట్రో మార్గం ప్రస్తుతం 700 కు పైగా ఉందని , 2025 నాటికి ఇది 1700 కిలోమీటర్లకు విస్తరించేలా పనిచేస్తున్నామని అన్నారు . ఇవన్నీ కోట్లాది భారతీయుల జీవితేచ్ఛకు రుజువులని , పౌరుల ఆకాంక్షలు తీరుతున్నాయనేందుకు ఆధారాలని మోడీ టించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు మెట్రో రైలు గొప్ప పరిష్కారంగా పేర్కొన్నారు మోడీ. నగర అవసరాలు , అక్కడి పనిచేసే జనాభాను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మెట్రో విధా నాన్ని రూపొందించిందని ఆయన చెప్పారు .
ఢిల్లీ- మీరట్ మధ్య రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ( ఆర్ఆర్ఎస్ ) పూర్తయితే రెండు నగ రాల మధ్య ప్రయాణ సమయం గంటలోపే ఉంటుందని ఆయన అన్నారు. తక్కువ ప్రయాణి కులు ఉండే నగరాల కోసం మెట్రో లైట్ , మెట్రో నియో తరహా సేవలను అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. మెట్రో రైలు నిర్మాణంలో కూడా భారత్ లో తయారీ ఆవశ్యకతను మోడీ నొక్కిచెప్పారు . డ్రైవర్ లేని రైలు ప్రారంభంతో ఈ సౌకర్యం ఉన్న ప్రపంచంలోని అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరిందని మోడీ అన్నారు. ఇక నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు ఎక్కడైనా సరే ప్రజా రవాణాను సులభ తరం చేస్తుందని ఆయన తెలిపారు. సంక్లిష్టమైన ప్రక్రియలను సరళతరం చేస్తూ సమీకృత సేవలు అందించడం ద్వారా తన ప్రభుత్వం ప్రజల సమయాన్ని చేస్తోందన్నారు. ఫాస్టాగ్ కార్డులు , ఒన్ నేషన్ ఒన్ గ్రిడ్, నిరంతర గ్యాస్ అనుసంధానం, వస్తు సేవల పన్ను ( జిఎస్టి ) , ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డు లాంటి వాటిని దీనికి ఉదాహరణలుగా చెప్పారు . ప్రధానమంత్రి . పూర్తిగా స్వయం చోదితంగా ( ఆటోమేటెడ్ ) నడిచే రైళ్లు మానవ లోపాలు జరిగే అవకాశాన్ని తీసేస్తాయి . జనక పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు మెజెంటా లైన్లో డ్రైవర్ లేని మెట్రో ప్రారంభించిన అనంతరం , మజ్లిస్ పార్క్– శివ్ విహార్ మధ్య పింక్ లైలో కూడా 2021 మధ్య నాటికి ఈ సేవలు అందుబాటు లోకి వస్తాయన్నారు . దేశంలోని ఏ ప్రాంతంలో జారీచేసిన రూపే డెబిట్ కార్డు ద్వారా ప్రయాణం సాగించడమే నేషనల్ కామన్ మొబి లిటీ కార్డు ఉద్దేశం .
