May 12, 2025

Digital Mixture

Information Portal

మార్కెట్లో దొరికే మామిడి పండ్లు తింటున్నారా… అయితే ఇది తెలుసుకోండి

1 min read
Be careful when you buy yummy looking Mangoes

Be careful when you buy yummy looking Mangoes

పక్వానికొచ్చిన మామిడి కాయల్ని కోసి సహజంగా మాగవేస్తే పండ్లు రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఇవి ఎలాంటి హానిచేయవు. కాని వ్యాపారులు పక్వానికి రాకముందే కాయల్ని కోసి నిషేధిత కాల్షియం కార్బైడ్ రసాయనంతో కృత్రిమంగా మాగవేసి ఆకర్షణీయమైన రంగు తెప్పించి మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా మాగవేసిన పండ్లు ఆరోగ్యానికి మంచివికావు. ఈ రసాయనం వాడకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినా క్షేత్ర స్థాయిలో అమలుతీరు సక్రమంగా లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టేషన్ యాక్టు 1954 చట్టం, 1955 లోని మరో రూల్స్ ప్రకారం కాల్షియం కార్బైడ్ తో పండ్లను మాగబెట్టడాన్ని నిషేధించారు. చట్టాన్ని అతిక్రమించిన వారికి మూడేళ్ళు జైలు శిక్షతో పాటు జరి మానా కూడా విధిస్తారు. కాల్షియం కార్బైడ్ తో మాగబెట్టిన మామిడి పండ్లను తినరాదని , ప్రత్యా మ్నాయ విధానాలపైన అవగాహన పెంపొందించాలనే ఉద్దేశ్యంతో సంగారెడ్డిలోని పండ్ల పరిశోధనా శాస్త్రవేత్తలు ఇటీవల ఓ ర్యాలీ కూడా నిర్వహించారు.

కాల్షియం కార్టెలో మాగవేస్తే : ఈ రసాయనం గాలిలోని తేమతో కలిసినప్పుడు వెలువడే ఎసిటిలీన్ వాయువులో పాస్ఫీన్, ఆర్సెలిన్లు ఉంటాయి. దీనితో మాగేసిన పండ్లను తిన్నవారికి అల్సర్లు, కాన్సర్, కాలేయ, మూత్రపిండ వ్యాధులు వచ్చే ప్రమాదముంటుందని, ఎసిటిలీన్ వాయువు కేంద్ర నాడీవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎసిటిలీన్ వల్ల తలభారంగా మారడం , దీర్ఘ కాలిక మత్తు , జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలుంటాయని చెబుతున్నారు. పైగా ఈ పద్ధతిలో మాగేసిన పండ్లు పుల్లగా ఉంటాయి. రుచి ఉండదు. తక్కువకాలం నిల్వ ఉంటాయి. రెండు, మూడు రోజుల్లోనే తొక్కల పైన మచ్చలు వస్తాయి. త్వరగా బరువుకోల్పోతాయి. మాగబెట్టేందుకు ఖర్చు ఎక్కువ. రవాణాలో నష్టం అధికంగా ఉంటుంది.

ఇథిలీన్ వాయువుతో మాగబెట్టడం మంచిది : ఈ విధానం ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా అనుమతి పొందింది. ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఇథి లీన్ వాయువుతో మాగేసిన పండ్లు తియ్యగా, రుచిగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మాగబెట్టేం దుకు ఖర్చు తక్కువ. రవాణాలో కూడా నష్టం తక్కువ. ఈ పద్ధతిలో పండ్ల మాగవేతకు ఇథిలీన్ రైపనింగ్ చాంబర్లను ఏర్పాటు చేసుకోవాలి. మూడొంతులు తయారై పక్వానికి చ్చిన మామిడి కాయల్ని కోసి రైప నింగ్ ఛాంబర్లో ఉంచి , 100-150 పి . పి.ఎం … ఇథిలీన్ వాయువు ప్రవేశ పెట్టాలి. 12-24 గంటల పాటు ఛాంబర్ తలుపులు తెరవకుండా ఉంచాలి. తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద నాలుగైదు రోజుల్లోనే కాయలు మంచి రంగును సంతరించుకొని మాగుతాయి. సంగారెడ్డిలోని ఫల పరి శోధన స్థానంలో ఏర్పాటు చేసిన ఇథిలీన్ గదుల్లో వ్యాపారుల నుంచి కొంతరుసుం వసూలుచేసి మామిడి కాయల్ని ఇథిలీన్ ఛాంబర్లో మాగవేసి ఇస్తున్నారు .
రైతు , వినియోగదారుల స్థాయిలో… మొక్కల్లో ఎథిలీన్ అనే హార్మోను వాయురూపంలో సహజంగా తయార వుతుంది. ఇది కాయల్ని మాగేటట్లు చేస్తుంది. మార్కెట్లో లభించే ఎథిరి రైతు , వినియోగదారుల స్థాయిలో మామిడికాయల్ని మాగేసుకోవచ్చు. లీటరు నీటికి 1.25 మి.లీ. ఎథిరిల్ కలిపిన ద్రావణంలో కాయల్ని 5 నిమిషాలు ముంచి, తీసి ఆరబెట్టి ఏదైనా అట్టపెట్టెల్లో ఉంచితే మూడు, నాలుగు రోజుల్లోనే పూర్తిగా మాగుతాయి.

ఇంట్లో సహజంగా మామిడి కాయల్ని మాగవేసే పరిస్థితుల్లో పండ్లు కుళ్లిపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది. కోత సమయంలో కాయ లకు దెబ్బతగిలినా, కాయలపై శిలీంద్రపు తెగుళ్లు ఆశించి ఉన్నా పండ్లు మాగే సమయంలో కుళ్లిపోతుంటాయి. పక్వానికొచ్చిన కాయల్ని దెబ్బ తగలకుండా జాగ్రత్తగా చెట్లనుంచి కోయాలి. మాగవేయటానికి ముందు శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టాలి . తర్వాత వరిగడ్డితో మాగబెట్టాలి.

మార్కెట్లో పండ్లు కొనే ముందు : కాల్షియం కార్బైడ్ తో మాగేసిన పండ్లు పూర్తిగా పసుపు రంగులో కాకుండా అక్కడక్కడ ఆకుపచ్చ రంగు ఉంటుంది లేదా గాఢ పసుపు ( బ్రైట్ ఎల్లో ) రంగులో ఉంటాయి. పండ్లు పైకి పండ్లు పైకి మాగినట్లు కనిపించినా లోపల పూర్తిగా మాగవు. తక్కువ రసం ఉంటుంది . వినియోగదారులు మార్కెట్లో పండ్లను కొనే ముందు ఈ లక్షణాలను గమనించడం మంచిది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *