బిగ్ బాస్ సీజన్ 5 నుండి నాగార్జున అవుట్ ? మరి ఎవరు హోస్ట్ చేయబోతున్నారు!
1 min read
Nani As A Host For Bigboss Telugu Season 5
బిగ్ బాస్ తెలుగులో ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. దిగ్విజయంగా 4 సీజన్లను పూర్తి చేసుకుంది. కరోనా కష్టకాలంలో కూడా 4 సీజన్ ని సక్సెస్ చేసారు. దీనికి అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 4 వ సీజన్ చాలా రసవత్తరంగా జరిగింది. లాక్ డౌన్ కారణంగా ప్రేక్షకులు కూడా టీవీలకు అతుక్కుపోయారని చెప్పొచ్చు. మొదట్లో కొంత టి ఆర్ పి ల పరంగా నిరాశపరిచినా తరువాత పుంజుకుంది. ఇందులో నాగార్జున తన హోస్టింగ్ తో సక్సెస్ చేసాడని చెప్పొచ్చు. ఫైనల్ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావడం విన్నర్ అభిజిత్ కి ట్రోఫీని ఇవ్వడం ఈ బిగ్ బాస్ సీజన్ కే ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి రావడం, తనదైన శైలి తో ఆకట్టుకోవడంతో ఈ ఫైనల్ ఎపిసోడ్ టి ఆర్ పి ఒక్కసారి పెరిగి పోయింది.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ తరువాత సీజన్ పై అంచనాలు పెరిగిపోయాయి. హోస్టింగ్ నుండి, పోటీలో పాల్గొనే సెలబ్రిటీల గురించి అప్పుడే చర్చ మొదలైంది. ఎందుకంటే 4 వ సీజన్ ని సక్సెస్ చేసిన అక్కినేని నాగార్జున కొత్త సీజన్ కి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా ఉన్నది. బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున అయితే బాగుంటుందని సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ వచ్చే సంవత్సరం వరకు నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా, మనం సీక్వెల్స్ తో బిజీ ఉండనున్నాడు. దీనితో బిగ్ బాస్ యాజమాన్యం మరొకరిని వెతికే పనిలో పడింది.
వచ్చే ఏప్రియల్ నుండి 5 వ సీజన్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం నేచురల్ స్టార్ నాని తో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే దీనికి నాని దగ్గరినుండి సమాధానం ఇంకా రాలేదని తెలుస్తోంది. ఒకవేళ నాని ఒప్పుకోకపోతే ఇంకెవరు హోస్ట్ చేసే అవకాశం ఉందనే దానిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా వరుస సినిమాలతో బిజీ ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి ని సంప్రదించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చిరంజీవి గత సీజన్ ని ఎంతగా ఫాలో అయ్యారో ఫైనల్ ఎపిసోడ్ చూస్తే అర్ధమవుతుంది.
అలాగే 5 వ సీజన్ లో పాల్గొనే వారిపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇందులోముఖ్యంగా యాంకర్ విష్ణు ప్రియ పేరు మొదటగా వినిపిస్తోంది. వీటిపై బిగ్ బాస్ యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
