రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా…. Rajamouli, Mahesh Babu Movie Latest Updates
1 min read
Raajamouli Mahesh Babu Movie Updates
పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అవుతున్న తండ్రీతనయులు…
ఒకరు దర్శక ధీరుడు మరొకరు సూపర్ స్టార్, వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే సినీ అభిమానులకు పండగే. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తోంది. ఈ కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.
ఇంత క్రేజీ కాంబో కి కథ దొరకడం అంత సులభమైన విషయం కాదని చెప్పొచ్చు. అయితే రాజమౌళి సినిమాలు భారీ బడ్జెట్ తో తెర కెక్కుతాయి. ఆయన సినిమాలో గ్రాఫిక్స్ ని ఎక్కువగా వాడుకుంటారు. వాటికి ఉదాహరణ మగధీర, ఈగ, బాహుబలి సీరిస్. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా ఇలాంటి పీరియాడికల్ సినిమా తీస్తాడా లేక వేరే కొత్త తరహా కథ సిద్ధం చేస్తున్నాడా అనే ఉత్సుకత ఇటు ఫ్యాన్స్ లో, అటు సినిమా ఇండస్ట్రీ లో ఉంది.
అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోది. అయితే ఈ కథ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతోంది అని తెలుస్తోంది. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఇద్దరు మహేష్ బాబు ని ఎవరూ ఊహించని విధంగా స్క్రీన్ మీద చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ద్రుష్టి ఆఫ్రికా అడవుల వైపు పడింది. ఈ సినిమా ఆఫ్రికా లోని అడవుల్లో జరిగే యాక్షన్, ఎడ్వెంచర్ గా తెరకెక్కించడానికి స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారట. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా లో కూడా చూపించని విధంగా ఆఫ్రికా అడవుల్లో యాక్షన్,ఫారెస్ట్ ఎడ్వెంచర్ ని చూపించానున్నారని సమాచారం.
ఈ సినిమా మరోసారి రాజమౌళి గత సినిమాల మాదిరిగానే భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. అయితే దీనికి సంబంధించిన అన్ని వివరాలతో అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం.
అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే 2022 లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13 తేదీన విడుదల కానుంది. అటు మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వం లో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు.
