RRR movie Update: “ఆర్ఆర్ఆర్” థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకున్న బాలీవుడ్ బడా సంస్థ… అఫీషియల్ గా ప్రకటన..
1 min read
Rrr Movie Update
ఎస్.ఎస్. రాజమౌళి రౌద్రం, రణం, రుధిరం (RRR) సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ అయినా అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా తెలుగు సినిమానే కాదు ఇది పాన్ ఇండియా గా తెరకెక్కుతోంది. దీనికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కావడం, అలాగే టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటం, పోస్టర్స్, ఫస్ట్ లుక్ ఈ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. అలాగే రేపు ఏప్రిల్ 2 వ తేదీన అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే ఈ సినిమా కి సంబంధించిన ఇంకొక అఫీషియల్ వార్త ఏంటంటే, ఈ సినిమా హిందీ మార్కెట్ మొత్తానికి థియేట్రికల్ రైట్స్ ని PEN Studios దక్కించుకుంది. ఈ సంస్థ హిందీ మార్కెట్ మొత్తం విడుదల చేయబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా PEN studios వారు twitter ద్వారా ప్రకటించారు. వీరు ఎలక్ర్టానిక్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుంది.
నార్త్ ఇండియాలో PEN studios వారు బాహుబలి ని మించి ప్రమోషన్ చేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి భారీ మొత్తానికి RRR రైట్స్ తీసుకున్నారు.
అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ తో పాటు సౌత్ స్టార్ సముద్రఖని, శ్రియా శరన్ కొన్ని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.
