Indian Idol season 12 Winner: Pawandeep Rajan
1 min read
Indian Idol 12 Winner
ఎంతో ఆత్రుతగా జరిగిన ఇండియన్ ఐడల్ 12 లో విజేతగా పవన్ దీప్ రాజన్ నిలిచాడు. తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానం లో నిలిచింది. స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఈ సింగింగ్ కాంపిటీషన్ చాలా రసవత్తరంగా జరిగింది. 12 గంటల పాటు జరిగిన ఈ పోటీలో 30 రౌండ్స్ ని నిర్వహించారు. ఈ ఎపిసోడ్ లో అందరు కలిసి దాదాపు 200 పాటలు పాడటం జరిగింది.
ఈ ఫైనల్ లో ఐదుగురు కంటెస్టెంట్‌లను ఓడించి పవన్ దీప్ రాజన్ విజేతగా నిలిచాడు. అయితే ఇండియన్ ఐడల్ 12 సీజన్ లో షణ్ముఖ ప్రియ తప్పకుండా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలవడంతో తెలుగు రాష్ట్రాల అభిమానులు కాస్త నిరాశ చెందారు.
న్యాయనిర్ణేతలుగా ఉన్న అను మాలిక్, సోను కక్కర్, హిమేష్ రేష్మియా పవన్ దీప్ రాజన్ విజయాన్ని ప్రకటించారు. అలాగే ఈ గ్రాండ్ ఫైనల్ లో సినీ ప్రముఖులు జావెద్ అలీ, మనోజ్ ముంటాషిర్, ఉదిత్ నారాయణ్, కుమార్ సను, అల్కా యాగ్నిక్, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
