#Marburg Virus: కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్… కరోనా కంటే ఎక్కువ ప్రమాదం అంటున్న WHO…
1 min read
New Virus Marburg
గబ్బిలాల నుండి మనుషులకు సోకే ఈ వైరస్…
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో వణికి పోవైరస్ లు పుట్టుకొస్తున్నాయి. ఇంకా ఈ కరోనా వైరస్ దశలు మారుతూ ఏదోరకంగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఎప్పుడు తగ్గుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఈ లోగా ఏవేవో కొత్త కొత్త వైరస్ లు వెలుగులోకి వస్తున్నాయి.
ఎబోలా లాంటి ప్రమాదకరమైన వైరస్ పుట్టిన పశ్చిమ ఆఫ్రికాలో ఇప్పుడు ఒక కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ పేరు “మార్ బర్గ్”. ఈ వైరస్ పశ్చిమ ఆఫ్రికా లోని గునియా దేశంలో బయట పడింది. అయితే WHO చెప్పిన దాని ప్రకారం ఇది ఎబోలా కి సంబంధించిన ప్రాణాంతకమైన వైరస్ పరిగణిస్తున్నారు.
అయితే ఈ వైరస్ కూడా కోవిడ్ 19 లాగే జంతువులనుండి మనుషులకు వ్యాపించే వైరస్ గా ఈ మాల్ బర్గ్ ని WHO ధృవీకరించింది. గునియా ఒక మరణించిన వ్యక్తి నుండి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ ని గుర్తించామని WHO తెలిపింది. నిపుణుల ప్రకారం గబ్బిలాలో ఉండే ఈ వైరస్ తో 88 శాతం మరణాల రేటు ఉండే అవకాశం ఉంది.
అయితే డాక్టర్లు చెప్పిన ప్రకారం, ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దీనిని త్వరగా అరికట్టకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. దీనితో ఆఫ్రికా దేశాలకు WHO హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రమాదకరమైన ఎబోలా ను కట్టడి చేసిన అనుభవం గినియా ప్రభుత్వానికి ఉంది. దీనిని మిగతా ఆఫ్రికా దేశాల డాక్టర్లు ఉపయోగించుకొని ఈ కొత్త మార్ బర్గ్ ని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఈ వైరస్ ని అరికట్టడానికి WHO రంగంలోకి దిగింది. ఈ మార్ బర్గ్ వైరస్ ఒకసారి గబ్బిలాల నుండి మనుషులకు సోకితే, శరీర స్రావాల ద్వారా ఈ మార్ బర్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. గినియా అటవీ ప్రాంతంలో ఈ వైరస్ బయట పడింది. జులై 25 వ తేదీన ఒక వ్యక్తి వైరస్ బారిన పడి చనిపోగా, ఆ వ్యక్తికి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ లో ఎబోలా నెగటివ్, మాస్ బర్గ్ పాజిటివ్ అని తేలింది.
ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, అసౌకర్యం తో బాధ పడుతారు. ఈ వైరస్ వ్యాప్తి చెందితే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుందని WHO నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంత త్వరగా దీన్ని అరికట్టగలిగితే అంత మరణాల రేటు తగ్గే అవకాశం ఉంది.
