#Chiru153 Official: మెగాస్టార్ చిరంజీవి 153 వ సినిమా టైటిల్ విడుదల…
1 min read
Megastar As Godfather, Megastar Chiranjeevi 153 movie Title released. Image/Twitter.
“గాడ్ ఫాదర్” గా మెగాస్టార్….
ముందుగా ప్రకటించినట్టుగానే కొణిదెల ప్రొడక్షన్స్ వారు ఈ రోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి 153 వ సినిమా లూసిఫర్ రిమేక్ సినిమా టైటిల్ ని ప్రకటించారు. చాలా రోజులుగా ప్రచారం లో ఉన్న గాడ్ ఫాదర్ టైటిల్ నే ఖరారు చేసారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు.
మలియాళం లో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ చేసిన లూసిఫర్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమానే ఈ గాడ్ ఫాదర్. రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ ని విడుదల చేయడం జరిగింది. ఈ టైటిల్ పోస్టర్ లో మనం కోటు వేసుకుని, తలపై టోపీ చేతిలో గన్ పట్టుకున్న చిరంజీవి ని చూడొచ్చు. ఈ సినిమా మేకర్స్, చిరంజీవిని మునుపెన్నడూ చూడని విధంగా చూడబోతున్నట్టు చెబుతున్నారు.
అయితే మలియాళం లో మోహన్ లాల్ సినిమా మొత్తం తెల్ల చొక్కా, పంచె తో కనిపిస్తారు. చివర్లో తాను ఒక గ్యాంగ్ కి లీడర్ గా చూపెడుతూ కొంత డాన్ లుక్ లో కనబడతారు. మరి గాడ్ ఫాదర్ లో చిరు ఈ కొత్త గాడ్ ఫాదర్ గెటప్ సినిమాలో ఎంత సేపు ఉండబోతోందో సినిమా చూసాక మాత్రమే తెలుస్తుంది.
ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
