OTT Release: “టక్ జగదీశ్” ఎప్పుడు వస్తున్నాడంటే…
1 min read
Tuck Jagadish
ఓటిటి వేదికగా విడుదల …
టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా “టక్ జగదీశ్” విషయంలో రూమర్లు, ఊహాగానాలు, గాసిప్స్ చాలానే వినిపిస్తున్నాయి.అదే నాని వర్సెస్ నిర్మాతలు, ఎందుకంటే నాని తన లేటెస్ట్ మూవీ “టక్ జగదీశ్” ని థియేటర్లలో రిలీజ్ చేయాలని పట్టుబట్టాడు. నిర్మాతలు ఓటిటి లో మంచి ఆఫర్లు రావటంతో అటువైపే మొగ్గు చూపుతున్నారు. కానీ నాని ప్రయత్నం విఫలమైంది. చివరకు టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్దమైందని తెలుస్తోంది. దీంతో నేచురల్ స్టార్ నాని కొంత మనస్తాపానికి గురైనట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అమెజాన్ ప్రైమ్ టక్ జగదీష్ కు భారీమొత్తం చెల్లించేందుకు ముందుకు రావడంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని అతిత్వరలో ఓటీటీ ద్వారా విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా “టక్ జగదీశ్” నిర్మాతలు ఓటిటి వైపు మొగ్గు చూపడానికి కారణాలు లేకపోలేదు.
ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోవడంతో థియేటర్లపై ఆంక్షలు విధించారు. కర్ఫ్యూ, కొన్ని సమయాల్లో లాక్‌డౌన్ విధించడంతో సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. అందువల్ల టక్ జగదీష్ కూడా విడుదల కాలేకపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు, ఇతర వ్యవహారాలు “టక్ జగదీశ్” విడుదలకి అడ్డుగా మారాయి.
ఒకవేళ సినిమా ని థియేటర్లో విడుదల చేసినా ప్రేక్షకులు మునుపటిలా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఓటిటి కి అలవాటు పడిన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంత తేలికైన పని కాదని నిర్మాతలు ఓటిటి కే ఓటు వేస్తున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదలతో మరికొన్ని సినిమాలు కూడా ఆలోచనలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే జూలై నెలలో విడుదలైన విక్టరీ వేకటేశ్ నారప్ప మచి టాక్ ని తెచ్చుకోవడం, నిర్మాత సురేష్ బాబు మంచి లాభాలు పొందడం జరిగింది. కానీ ఇండస్ట్రీ లో ఓటిటి విడుదలపై కొంత వ్యతిరేకత రావడంతో నిర్మాత సురేష్ బాబు దృశ్యం 2, విరాట పర్వం సినిమా లను థియేటర్ల లోనే విడుదల చేసేలా ప్లాన్ చేసారు. కానీ మరి “టక్ జగదీశ్” విడుదల సురేష్ బాబు నిర్ణయాన్ని మళ్ళీ మార్చే అవకాశం ఉంది.
