మెగాస్టార్ చిరంజీవి సోదరిగా మహానటి …
1 min read
Chiru Sister
టాలీవుడ్ లో ఇప్పుడు అంతా మెగాస్టార్ చిరంజీవి వేదాళం రిమేక్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ ఒరిజినల్ సినిమాలో అజిత్ కి సోదరిగా లక్ష్మి రాయ్ నటించింది. హీరో అజిత్ కి సమానంగా లక్ష్మి రాయ్ పాత్ర ఉంటుంది. దీనితో మెగాస్టార్ రిమేక్ లో కూడా సోదరి పాత్ర కి అంతే ప్రాధాన్యత ఉంటుందట. అందుకే చిరు సోదరి పాత్రకి ఎవరిని తీసుకోవాలనే ఆలోచన పడ్డాయి చిత్ర యూనిట్. అయితే ఈ పాత్రకోసం సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు ప్రముఖంగా వినబడ్డాయి. ఇప్పుడు ఆ పాత్ర కి తగ్గ నటి దొరికిందని ఇండస్ట్రీ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆ నటియే మహానటి కీర్తి సురేష్. మొదట ఈ అమ్మడు ససేమిరా అన్నది. అయితే ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ కీర్తిని చాలా సార్లు కలిసి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడట. చివరికి ఆప్రయత్నం ఫలించినట్టు వార్తలు వస్తున్నాయి. కాకపొతే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం కాస్త ఎక్కువగానే ముట్టజెబుతున్నారట. ఇప్పటికే కీర్తి సురేష్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురిగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూ ఇలా కూతురిగా, సోదరిగా నటిస్తోంది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన సర్కారు వారు పాట లో నటిస్తోంది.
మరోపైపు ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ కు మొదలు పెట్టడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. దానితో పాటు ‘వేదాళం’ చిత్రాన్ని నవంబర్ నుంచి స్టార్ట్ చేసి రెండు రీమేక్ లను ఒకేసారి షూట్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 22న దీనిపై ఓ క్లారిటీ రావొచ్చు. అలానే ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ‘ఆచార్య’ విడుదల తేదీ కూడా ప్రకటించే అవకాశం ఉంది.
