టాలీవుడ్ ని శాసిస్తున్న సుకుమార్ శిష్యులు….
1 min read
Sukumar assistants are ruling Tollywood
వరుస విజయాలతో దూసుకుపోతున్న సుకుమార్ అసిస్టెంట్లు….
ప్రస్తుతం టాలివుడ్ లో ఎస్.ఎస్. రాజమౌళి (S S Rajamouli), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), బోయపాటి శ్రీను (Boyapati Srinu), సుకుమార్ (Sukumar) వంటి పలువురు స్టార్ డైరెక్టర్స్ గా రాణిస్తున్నారు. వీరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసిన కొంతమంది ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయమవుతున్నారు. అయితే అందరిలో సుకుమార్ శిష్యులు ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూ సినిమాలు తీస్తూ గుర్తింపు పొందుతున్నారు. సుకుమార్ ప్రోత్సాహంతో ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
దర్శకుడు సుకుమార్ దగ్గర రెండు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన పల్నాటి సూర్య ప్రతాప్ మొదటగా 2009 లో కరెంట్ సినిమాతో మెగాఫోన్ పట్టి విజయం సాధించాడు. తరువాత సుకుమార్ రచనలో కుమారి “21 F” సినిమాకు దర్శకత్వం వహించి తరువాత సుకుమార్ పై ఇష్టంతో మళ్ళీ రంగస్థలంలో దర్శకత్వ శాఖలో పనిచేసి అనంతరం “18 పేజెస్” సినిమా డైరక్ట్ చేసి మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.

అదేవిధంగా 2017 లో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై స్వయంగా సుకుమార్ నిర్మాతగా “దర్శకుడు” సినిమాతో జక్కా హరిప్రసాద్ నీ దర్శకుడిగా పరిచయం చేశాడు. ఈ సినిమా అంతగా విజయం సాధించకపోయినా సినీ వర్గాల ప్రశంసలను అందుకుందని చెప్పవచ్చు.

సుకుమార్ లెక్కల మాష్టారుగా పనిచేసినప్పుడు తన వద్ద చదువుకున్న బుచ్చిబాబు (Buchi Babu) సినిమారంగం పై ఆసక్తితో ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరి రంగస్థలం వంటి సినిమాలకు పనిచేసి వినూత్నమైన కథాంశంతో “ఉప్పెన” సినిమాను అద్భుతంగా తెరకెక్కించి ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా బారీ బడ్జెట్ సినిమా సినిమా సెట్స్ పైకి రానుంది.త్వరలోనే జూనియర్ యన్ టి ఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ వినూత్న చిత్రం తెరకెక్కుతుంది.

ఈ మధ్యే తెలంగాణలో సింగరేణి నేపథ్యంలో కథ తయారు చేసుకుని నాని హీరోగా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ “దసరా” మూవీ తో సూపర్ హిట్ అందుకుని సుకుమార్ శిష్యుడనిపంచుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). ఈ భారీ విజయంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంశలతో పాటు, ఆయన నిర్మాణ సంస్థలో సినిమాని చేసేందుకు మహేష్ బాబు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇటీవల సుకుమార్ రచనలో సాయిదర్మతేజ్, సంయుక్త మీనన్ దర్శకత్వంలో హీరో హీరోయిన్ లు గా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బీ ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుకుమార్ మరో శిష్యుడు కార్తిక్ వర్మ దండు (karthika Varma Dandu) దర్శకత్వం వహించిన “విరూపాక్ష” మూవీ కూడా ఘన విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో, దర్శకునికి పెద్ద హీరోలతో పని చేసే అవకాశం రావొచ్చు.

పాన్ ఇండియా మూవీ లు చేస్తూ వరుస హిట్లు ఇస్తూ కూడా తన శిష్యులు భవిష్యత్ కోసం తానే కథకుడిగా, స్వయంగా నిర్మాతగా మారి వారిని ప్రోత్సహిస్తూ దర్శకులుగా పరిచయం చేస్తూ, వారి విజయాలకు దోహదపడుతున్నారు. ఇలా తన శిష్యులకు అన్ని తానై ముందుకు నడిపిస్తున్న దర్శకుల్లో సుకుమార్ అగ్రస్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈయన ఆదరణ ఎలా ఉందంటే సుకుమార్ దగ్గర పనిచేస్తే ఆ సహాయ దర్శకుని భవిష్యత్తుకు ఇక తిరుగుండదు అనే అంత స్థాయిలో ఉంది. నాకు తెలిసి ఇటువంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీ లో అరుదు. కొసమెరుపు ఏంటంటే ఈయన పరిచయం చేసిన దర్శకులకు తానే కథను అందించి, నిర్మాతగా మారి మరీ వారిచే మెగా ఫోన్ పట్టించాడు.
ఒక ఇద్దరు దర్శకులు బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల వారే కథలు తయారుచేసుకుని దర్శకత్వం వహించి గురువును మించిన శిష్యలు అనిపించుకున్నారు.
ఆయన బాటలోనే నడుస్తున్న సుకుమార్ శిష్యుల సినిమాల విజయాల పరంపర చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని అద్భుతాలు జరుగనున్నాయో అని అటు సినిమా పరిశ్రమ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
