సలార్ సినిమా విడుదల వాయిదా ! Prabhas Salaar Movie release postponed
1 min read
Prabhas Salaar Movie Postponed
డార్లింగ్ ప్రభాస్, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సలార్. గత వారం వరకు ఈ సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల అవుతున్నట్టు ప్రకటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే ఒక న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే సలార్ సినిమా విడుదల వాయిదా పడింది. సెప్టంబర్ 28 వ తేదిన విడుదల కావాల్సిన సలార్ సినిమా వాయిదా పడింది.
ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమయింది. అయితే దీనికి కారణం కొన్ని ముఖ్యమైన ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం. ఈ పనులు సెప్టెంబర్ 28 వ తేదీ లోపు అవ్వడం కష్టం అవ్వడంతో, అది సినిమా మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి ఈ సినిమాని 28 వ తేదిన విడుదల చేయకపోవడమే మంచిదని భావించినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం తో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరాశ చెందినట్టు తెలుస్తోంది. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. ఈ సలార్ సినిమాతో ప్రభాస్ ప్రభంజనం శ్రుష్టించడం ఖాయమని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి కొంత నిరాశే అని చెప్పొచ్చు.
అయితే సెప్టెంబర్ 28 కి విడుదల అని సలార్ సినిమాకి యుస్ లో టికెట్ల అమ్మకాలు మొదలు పెట్టారు. టికెట్ల అమ్మకాల ద్వారా $400K వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా నేపథ్యం లో ఈ టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ సినిమా డిసెంబరులో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభాస్ తదుపరి సినిమా ప్రాజెక్ట్ K సినిమా జనవరి 2024 లో విడుదల అని అంటున్నారు. మరి ఈ రెండు పెద్ద సినిమాలు నెల వ్యవధిలో విడుదల అవుతాయా లేకుంటే మళ్ళీ వాయిదాల పరంపర కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.
