May 12, 2025

Digital Mixture

Information Portal

OTT partners of Bhagavanth Kesari, LEO and Tiger Nageswara Rao-Official

1 min read
OTT Partners of Bhagavanth Kesari, Leo and Tiger Nageshwara Rao

OTT Partners of Bhagavanth Kesari, Leo and Tiger Nageshwara Rao

ఏ సినిమా విడుదల అవుందంటే సినిమాని థియేటర్లలో చూడడానికి ఎదురు చూసే వాళ్ళతో పాటు ఈ మధ్య బాగా ఆదరణ పొందిన OTT లలో కూడా చూడడానికి వేచి చూస్తున్నారు. ఎందుకంటే సినిమా విడుదలైన 3 నుండి 4 వారాలలో OTT ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే సినిమా నిర్మాతలు విడుదలకు ముందే ఈ OTT యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇప్పుడు నిర్మాతలకు ఇది కూడా మంచి ఆదాయాన్ని అందిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అయితే 4 నుండి 5 వారాలలో అందుబాటులోకి వచేస్తోంది. ఇక సినిమా ఫ్లాప్ అయితే చెప్పాల్సిన పని లేదు. రెండు వారాలలోపే OTT లో దర్శనమిస్తాయి.

అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది దసరా సందర్భంగా విడుదలైన సౌత్ సినిమాల గురించి. అందులో ముఖ్యంగా నిన్న విడుదలైన భగవంత్ కేసరి (Bhagavanth Kesari), లియో (LEO) (OCT 19)మరియు ఈ రోజు (OCT 20) విడుదలైన టైగర్ నాగేశ్వర రావు (Tiger Naageshwara Rao).

నందమూరి బాలకృష్ణ అ రావిపూడి దర్శకత్వంలో నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) నిన్న(OCT 19) విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ ఎప్పుడు చేయని పాత్రలో చేసినట్టు తెలుస్తోంది. తన వయసుకి తగ్గ పాత్రని ఎంచుకున్నట్టు సినిమా అభిమానులు చెపుతున్నారు. నందమూరి అభిమానులు అందంలో సంబరాలు చేస్తున్నారు. కొత్త రికార్డులు క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ సినిమా ఏ OTT ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోంది అనే విషయం బయటికొచ్చింది. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాని ప్రముఖ OTT సంస్థ Amazon Prime Video వారు దక్కించుకున్నారు. అయితే సినిమాని విడుదల తేదీ నుండి 4 వారాల తరువాత ఎప్పుడైనా Amazon ప్రైమ్ వారు స్ట్రీమింగ్ చేయవచ్చు.

ఇక తలపతి విజయ్, లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లియో (LEO). ఈ సినిమా నిన్న (OCT 19)విడుడలై మొదటి రోజే భారీ వసూళ్ళని సాధించింది. మొదటి రోజు వసూళ్లలో షారుఖ్ ఖాన్ జవాన్, కె జి ఎఫ్ సినిమాలను దాటవేసిందని చర్చ జరుగుతోంది. అయితే ఈ LEO సినిమాని మరో దిగ్గజ OTT సంస్థ అయిన Netflix సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడా విడుదల నుండి 4 వారల తరువాత ఎప్పుడైనా Netflix లో అందుబాటులోకి రావొచ్చు.

దీనితో పాటు ఈరోజు (OCT 20)విడుదల అయిన మాస్ మహారాజా టైగర్ నాగేశ్వర రావు (Tiger Naageshwara Rao) తన OTT పార్ట్నర్ ని లాక్ చేసుకుంది. ఈ సినిమాని Amazon Prime Video సంస్థ సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *