Thalaivar Rajinikanth’s 171 movie with Lokesh Kanagaraj…
1 min read
Rajinikanth 171 Movie with lokesh kanagaraj
స్టైలిష్ మాస్ యాక్షన్ త్రిల్లర్ వచ్చేస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్, ఈ పేరు తమిళ నాట ఒక ప్రభంజనం. ఎంతమంది యువ హీరోలు వస్తున్నా, రజినీకాంత్ వరుస ఫ్లాపులు ఇస్తున్నా ఆ ఎత్తైన శిఖరాన్ని ఎవరు కదిలించలేకపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వరుస ఫ్లాపుల దశలో ఉన్న రజినీకాంత్, ఈ సంవత్సరం విడుదలైన జైలర్ సినిమా తో ఒక్కసారి అందరినీ పక్కకు జరిపేసి ఎవరైనా తన తరువాతే అని చెప్పకనే చెప్పాడు. వయసును పక్కనపెట్టి తను చేసే సినిమాలను చూసి ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులను సైతం ఆకట్టుకుంటున్నారు.
జైలర్ సినిమా సూపర్ సక్సెస్ తో 600 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సినిమా రజినీకాంత్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. రజినీకాంత్ తెరపై కనపడని సంన్నివేశం లేదనే చెప్పొచ్చు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మించారు. ఈ సినిమా వీరికి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
అయితే వీరి నిర్మాణంలో రజినీకాంత్ మరో సినిమా చేయబోతున్నారు. రజినీకాంత్ చేయబోయే 171 వ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. దీనికి మాస్ అండ్ యాక్షన్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండియా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే లోకేష్ కనగ రాజ్ మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు. కమలహాసన్ ని విక్రమ్ సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసి, కమలహాసన్ లో దాగున్న మరో కోణాన్ని చూపించాడు. ఇప్పుడు రజినీకాంత్ తో సినిమా అంటే, మరి రజినీకాంత్ ని ఎలా చూపించబోతున్నాడని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
