May 21, 2024

Digital Mixture

Information Portal

BABY movie going to remake in Hindi- It is Official

1 min read
Baby movie Hindi remake

Baby movie Hindi remake- Image: YouTube-Geetha Arts

ఈ సంవత్సరం జూలై లో విడుదలైన బేబీ (Baby) సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇందులో నటించిన అందరికి మంచి పేరుతొ పాటు నిర్మాతకి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగులో ఇప్పటికే ఎన్నో ప్రేమ కథలు వచ్చినా, వస్తున్నా వాటికి ఆదరణ ఎప్పటికి ఉంటుంది. ప్రేమ కథని కొంచెం కొత్తగా చెప్పగలిగితే ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మరియు విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ముఖ్య పాత్రల్లో నటించిన బేబీ సినిమాని సాయి రాజేష్ (Sai Rajesh) దర్శకత్వం వహించాడు.

అయితే తెలుగులో పెద్ద విజయాన్ని అందుకున్న బేబీ సినిమాని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. బేబీ సినిమాని హిందీ లో రిమేక్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని కోటబొమ్మాళి P S (Kota Bommali P S)సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) దీనిని ధ్రువీకరించారు. తెలుగు సినిమా బేబీ కి నిర్మాత అయిన SKN హిందీ లో కూడా నిర్మాతగా రీమేక్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ హీరో, హీరోయిన్ మరియు దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

బేబీ సినిమా తో మంచి అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి వెండితెరపై కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, SKN మరియు సాయి రాజేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *