అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రభాస్ ని దాటలేకపోయిన రణబీర్ కపూర్
1 min read
salar vs animal
అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ (Salaar) ని దాటని ఆనిమల్ (Animal)
ఇప్పుడు ఎక్కడ చూసిన రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సినిమా ఆనిమల్ (Animal). తెలుగు దర్శకుడు అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఫస్ట్ లుక్, టిజర్ విడుదల తరువాత అది మరింత పెరిగింది. ఈ రోజు విడుదలైన ట్రైలర్ చూసాక ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. రణబీర్ కపూర్ ని ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా సందీప్ చూపించాడు. దీనితో ఇండియా మొత్తం ఈ సినిమా గురించి ఎదురు చూస్తోంది.

ఈ డిసెంబర్ 1 వ తేదిన ఆనిమల్ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని అమెరికా మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఈ సినిమా 5034 టిక్కట్లు అమ్మి $84432 ని వసూలు చేసింది. అయితే ఇప్పటికే ప్రభాస్ (Prabhas) సలార్ (Salaar) సినిమా టికెట్లను అమెరికాలో అమ్మటం మొదలు పెట్టింది. అయితే ఈ సినిమా ఇప్పటిపరకు 7005 టికెట్లను అమ్మి $184002 వసూలు చేసింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభాస్ సలార్ డిసెంబర్ 21 నుండి అమెరికాలో ప్రిమియర్ షో లు జరగనున్నాయి. ఇంకా ఇన్ని రోజుల ముందుగానే అన్ని టికెట్లు అమ్ముడు పోయాయి. కానీ రణబీర్ కపూర్ ఆనిమల్ సినిమా ఈ నెల 30 తేదిన అమెరాకాలో ప్రిమియర్ షోలు జరగనున్నాయి. కాని ఆనిమల్ సినిమా సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో చాలా తక్కువగా వసూలు చేసిందని చెప్పొచ్చు. దీన్నిబట్టి సలార్ సినిమా క్రేజ్ ఎంతలా ఉందొ అర్ధమవుతుంది.
ఈ రోజు విడుదలైన అనిమల్ సినిమా ట్రైలర్ ఒకసారి చూడండి.- Watch Animal Movie Trailer
