May 21, 2024

Digital Mixture

Information Portal

Megastar Chiranjeevi as “VISHWAMBHARA”- #Mega156 Vasishta Movie

1 min read
Megastar 156th Movie

Megastar #Mega156 Vishwambhara

Megastar Chiranjeevi 156th Movie title confirmed as VISHWAMBHARA

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 156 వ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. బింబిసార (Bimbisara) తో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కి మంచి విజయాన్ని అందించిన వశిష్ట్ (Vasishta) రెండవ సినిమాకే మెగాస్టార్ 156 వ సినిమాకి దర్శకత్వం వహించే అదృష్టాన్ని దక్కించుకున్నాడు. బింబిసార సినిమాలాగానే మరోసారి సోషియో ఫాంటసి కథతో మెగాస్టార్ తో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాని యు.వి. క్రియేషన్స్ ( U.V. Creations)నిర్మిస్తోంది.

మన మెగాస్టార్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మన అందరికి తెలుసు. మళ్ళీ చాల రోజుల తరువాత అలాంటి కథలో మనం మెగాస్టార్ ని చూడబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకి జగదేక వీరుడు అతిలోక సుందరి (Jagadeka Veerudu Athiloka Sundari) పేరును కూడా పరిశీలనలో ఉంచినట్టు తెలిసింది. కానీ నిర్మాత అశ్వినీ దత్ (Aswini Dutt) దీనికి అంగీకరించలేదని వార్తలు వినబడ్డాయి.

అయితే అన్నిటిని కాదని మెగాస్టార్ 156 వ సినిమాకి విశ్వంభర (Vishwambhara) పేరు ని ఫైనల్ చేయడం జరిగింది. సినిమా పేరు బయటకి వచ్చినప్పటినుండి ఈ సినిమా పై మంచి క్రేజ్ ఏర్పడింది. దర్శకుడు వశిష్ట్ (Vasishta)ఇప్పటికే VFX పనులను మొదలు పెట్టేసాడు. ఈ నెల 15 వ తేది నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

ప్రస్తుతం చిరంజీవి వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాటి (Lavanya Tripathi) పెళ్లి (Marriage)వేడుకల్లో ఇటలీ (Italy) లో ఉన్నారు. చిరంజీవి ఇటలీ నుండి రాగానే లుక్ టెస్ట్ జరపనున్నారు. లుక్ టెస్ట్ ఫైనల్ చేసుకొని మెగాస్టార్ చిరంజీవి కూడా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ రాజమండ్రి లో జరపనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా లో చిరంజీవి కి జోడీగా అనుష్క (Anushka) నటిస్తోంది. సంగీతం ఆస్కార్ విజేత యం.యం. కీరవాణి (M.M. Keeravani) అందిస్తున్నారు. ఇతర నటినటులు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఈ సినిమాని అన్ని అనుకున్నట్టు జరిగితే 2024 దసరాకి కాని లేదా 2025 సంక్రాంతి కి తప్పకుండ విడుదల చేయాలని ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *