Dengue Fever Symptoms-డెంగ్యూ జ్వరం లక్షణాలు
1 min read
Dengue Fever.
ఇప్పుడు ఇండియాలో డెంగ్యూ జ్వరం విస్తారంగా ప్రబలుతోంది.
ముఖ్యంగా ఈ జ్వరం దోమ కాటు వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా వర్షాకాలంలో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. మురికి ప్రాంతాల్లో త్వరగా దోమలు పుట్టే అవకాశాలు ఉంటాయి. ఈ దోమ పేరు Aedes Aegypti. ఈ దోమల ద్వారా జికా, చికన్ గునియా లాంటి వైరస్ లు కూడా వ్యాప్తిస్తాయి.
ఈ డెంగ్యూ జ్వరం లక్షణాలు:
జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు ,
తల, వొళ్ళు నొప్పులుగా అనిపించినప్పుడు
కళ్ళు నొప్పిగా ఉండటం,
కడుపు నొప్పిగా ఉండటం,
వికారంగా అనిపించడం,
వరుసగా వాంతులు అవడం,
పై విధమైన లక్షణాలు కనిపిస్తే దానిని డెంగ్యు గా అనుమానించవచ్చు.
ఈ జ్వరం వచ్చినప్పుడు ముఖ్యంగా మన శరీరంలోని ప్లేట్లేట్ ల సంఖ్య తగ్గిపోతుంది.
రక్తం శాతం తగ్గుతుంది. దీనితో మన శరీరం శక్తిని కోల్పోయి నీరసంగా మారుతుంది.
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే డెంగ్యు నిర్ధారిత పరీక్ష చేయించుకోవాలి.
