Latest: Corona Cases increasing day by day in India…ఇండియాలో రోజు రోజుకు భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
1 min read
Corona Cases increasing day by day in India
కరోనా (Corona) పేరును కలలో తలుచుకోవాలంటే కూడా భయంవేసే అంతలా కరోనా వైరస్ (Corona Virus) మన జీవితాలపై ప్రభావం చూపింది. ప్రపంచ దేశాలు అన్నీ ఒక్కసారిగా అతలాకుతలమైన పరిస్థితుల్ని మనం చూసాం. మన దేశంలో కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు నేలకొన్నాయో మనం కళ్ళారా చూశాం.
ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలతో పాటు మనదేశం లో కూడా కరోనా తగ్గుముఖం పట్టి అన్ని కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి అనుకునేలోపే, మరోసారి కరోనా కేసులు నమోదవ్వటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యే పనుల్లో నిమగ్నమైంది. దేశంలో రోజు రోజుకు కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవ్వాలని కేంద్రం సూచించింది.

గడిచిన 24 గంటల్లో 3,038 కేసులు నమోదైనట్టు కేంద్ర మత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది. దేశంలో మూడు రోజులు వరుసగా 3,000 లకు పైగా కేసులు నమోదవ్వడం కొంత కలవరపెట్టే అంశంగా చెప్పొచ్చు. దీనితో భారత్ లో మొత్తం యాక్టివ్ కేసులు 21,179 కి చేరినట్టు తెలుస్తోంది.
