రాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు…
1 min read
Mahesh Babu play as Ram opposite Deepika Padukone-Image: Twitter / @urstrulyMahesh
సీతగా దీపికా పడుకొనే, రావణుడిగా హృతిక్ రోషన్…
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో లో సినిమాల కథలు, మార్కెట్ పరంగా చాలా మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు హిందీ సినిమా, సౌత్ సినిమా అని చూసేవారు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా గా చూడటం మొదలు పెట్టారు. పాన్ ఇండియా పేరుతో సినిమాలను తీసి అన్ని భాషల సినిమా అభిమానులకు అందిస్తున్నారు. అందుకే సౌత్ సినిమాలు ఇప్పుడు ఎక్కువగా హిందీలో రీమేక్ అవుతున్నాయి. సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్ హీరోలతో జతకడుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్లు సౌత్ స్టార్స్ తో సినిమాలు తీస్తున్నారు. అందులోనూ సౌత్ స్టార్స్ ని పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి కూడా వేనుకాడట్లేదు. ఎందుకంటే సౌత్ స్టార్స్ మార్కెట్ కూడా బాలీవుడ్ స్టార్స్ తో సమానం అని చెప్పొచ్చు.
ప్రభాస్ – రాజమౌళి బాహుబలి పుణ్యమా అని టాలీవుడ్ రేంజ్ ఒక్కసారే మారిపోయింది. ఎందుకంటే బాలీవుడ్ ఇప్పుడు సౌత్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు. అందుకే ప్రభాస్ వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.
అయితే ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో రావణుడిగా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడిగా ఒక బాలీవుడ్ నిర్మాత రూ.300 కోట్లతో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో సీతగా దీపిక పడుకొనే, రావణుడిగా హృతిక్ రోషన్ నటింప జేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే సౌత్ సూపర్ స్టార్ అయితే సినిమాకి కలిసొస్తుందని, మహేష్ బాబు అయితే రాముడిగా బాగుంటాడని ఆ నిర్మాతలు భావిస్తున్నారట. ఈ విషయం మహేష్ బాబు వరకు వెళ్లిందట. కానీ మహేష్ బాబు నుండి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం మహేష్ బాబు పరుశ్ రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు 14రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని 2022 సంక్రాంతి కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
