May 12, 2025

Digital Mixture

Information Portal

300కు చేరువలో మరణాలు, కరోనా విలయతాండవం!

1 min read
300కు చేరువలో మరణాలు, కరోనా విలయతాండవం!

300కు చేరువలో మరణాలు, కరోనా విలయతాండవం!

దేశంలో మరోసారి కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొన్ని రోజుల నుంచి నిత్యం 40 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. క్రితం రోజున కాస్త తగ్గిన కేసులు తాజాగా రికార్డుస్థాయిలో విజృంభించాయి. మరణాలు 300 కు చేరువలో చోటు చేసుకున్నాయి. కొన్ని రోజుల నుంచి రికవరీ సంఖ్య పతనం కొనసాగుతోంది.

మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో 47,262 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కేసుల సంఖ్య 1,17 , 34,058 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది నవంబర్ 12 న దాదాపు 47 , 905 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా కారణంగా దేశంలో 275 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,60,441 కి పెరిగింది. క్రితం రోజున 199 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో భారీ మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే తొలిసారిగా 132 మంది ప్రాణాలు కోల్పోగా, పంజాబ్ లో 53, ఛత్తీస్ గఢ్ లో 20 , కేరళలో 10 మరణాలు సంభ వించాయి. రోజు వారీ కేసులు భారీగా పెరుగు తుండడంతో వరుసగా 14 వ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పైకి ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో 3,68,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 3.14 శాతానికి పెరిగింది. జాతీయ రికవరీ రేటు 95.49 శాతానికి పతమైనట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

24 గంటల వ్యవధిలో 23,907 మంది వైరస్ నుంచి బయట పడగా , రికవరీ సంఖ్య 1,12,05,160 కి పెరిగింది. మరణాల రేటు 1.37 శాతంగా కొన సాగుతుంది . ఇప్పటి వరకు దేశంలో 23,64,38,861 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది. మంగళవారం 10,25,628 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, ముఖ్యమంతి ఐదు రాష్ట్రాల్లో కొత్త కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో 77.44 శాతం మహారాష్ట్ర , పంజాబ్ , కర్నాటక , ఛత్తీస్గఢ్ , గుజరాత్ లోనే వెలుగు చూశాయి. అయితే మొత్తం ఆరు రాష్ట్రాల్లో 81.65 శాతం కొత్త కేసులు రికార్డు అయ్యాయి. ఇక మహారాష్ట్రలో కరోనా ప్రభావం అధికంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 28,699 కేసులు బయటపడగా, పంజాలో 2,254 , కర్నాటకలో 2,010 మందికి కరోనా సోకింది. 8 రాష్ట్రాల్లో వారాంతపు పాజిటివిటీ రేటు జాతీయ సగటు ( 4.11 ) కంటే అధికంగా ఉంది. మహారాష్ట్రలో పాజిటివిటీ రేటు 20.53 శాతంగా ఉన్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొత్త మరణాల్లో 83.27 శాతం ఆరు రాష్ట్రాల్లోనే సంభవించాయి. 12 రాష్ట్రాలు , యుటిల్లో 24 గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా సంభవించలేదు.

ఐదు కోట్లు దాటిన టీకాలు ::

మరోవైపు దేశంలో టీకా పంపిణీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతోంది. అయితే వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో మైలు రాయిని అధిగమించింది. ఇప్పటి వరకు ఐదుకోట్లకు పైగా లబ్ధిదారులకు టీకాలు వేశారు. మొత్తం 8,23,046 సెషన్లలో 5,08,41,286 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అందులో 79,17,521 మంది ఆరోగ్య కార్యకర్తలు , 83,62,065 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోస్ తీసుకోగా, 50,20,695 మంది ఆరోగ్య కార్యకర్తలు , 30,88,639 మంది ఫ్రంట్ ప్లాన్ వర్కర్లు రెండవ డోస్ తీసుకున్నారు. వీరే కాకుండా 45 ఏళ్ల దాటి దీర్ఘకాలిక వ్యాధుల గల వారు 47,01,894 మంది, 60 ఏళ్ల దాటిన వృద్ధులు 2,17,50,472 మంది మొదటి డోస్ తీసుకున్నారు. జనవరి 16 వ తేదీన ప్రారంభమైన వ్యాక్సిన్ పంపిణీ సజావుగా సాగుతోంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *