ఓడ కదులుతోంది… ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది…
1 min read
Suez Canal Crisis
ఫలించిన సిబ్బంది ప్రయత్నాలు …
త్వరలో సూయజ్ కాలువలో క్లీయర్ కానున్న ట్రాఫిక్ జామ్…
ప్రపంచం వాణిజ్య రంగం ఇప్పుడు మాట్లాడుకునేది సూయజ్ కాలువ గురించి. ఎందుకంటే ఈ కాలువ ప్రపంచం లోని అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాలలో ఒకటని చెప్పొచ్చు. ఈ సూయజ్ కాలువ ఈజిప్ట్ లోని ఒక కృత్రిమ సముద్ర జల మార్గం అని చెప్పొచ్చు. ఈ కాలువ ఇస్తమస్ అఫ్ సూయజ్ ద్వారా మధ్యధర సముద్రాన్నిమరియు ఎరా సముద్రాన్ని కలుపుతుంది అలాగే ఆఫ్రికాని, ఆసియా ఖండాలను విభజిస్తుంది. ఈ కాలువ ద్వారా యూరప్ దేశాలకు, పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఎక్కువ వాణిజ్య నౌకలు వెలుతుంటాయి.
అయితే గత వారం ఈ సూయజ్ కాలువ ద్వారా వెళుతున్న భారీ ఓడ మలుపు తీసుకునే క్రమంలో కాలువకు అడ్డంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ భారీ ఓడ 30 డిగ్రీల కోణంలో ఇరుక్కపోయింది. దీనితో సముద్ర మార్గంలో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పొచ్చు. ఎవర గివెన్ కంపనీ నౌక 20 వేల కంటైనర్లతో ఈ సూయజ్ కాలువలో చిక్కుకు పోయింది. మలుపు తీసుకునే క్రమంలో ఇసుక దిబ్బలో దిగబడి పోయింది. దీనితో ఆ భారీ ఓడను కదిలించడానికి సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఈ ఓడలో 20 వేల కంటైనర్లతో, 2 లక్షల టన్నుల సరుకు ఉన్నది. అయితే దీనిని కదిలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ భారీ ఓడ అడ్డుగా చిక్కుకోవడంతో ఆ కాలువ ద్వారా వెళ్ళే 450 కి పైగా ఓడలకు అంతరాయం కలిగింది.
అయితే ఈ ఎవర గివెన్ ఓడను కదిలించాలంటే ముందుగా ఈ ఓడని తేలిక పరచాలని నిపుణులు చెబుతున్నారు. అందులోని కంటైనర్లను తీయడానికే రెండు వారాలు పట్టొచ్చని నిపుణులు చెపుతున్నారు. అయితే ఈ ఓడని కదిలించే ప్రయత్నాల్లో కొంచెం పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఈ భారీ ఓడను కొంచెం కదిలించినట్టు సమాచారం. కానీ ఇంకా పూర్తిగా నీటిపై తీలడం లేదు. అయితే త్వరలోనే ఈ నౌకను కదిలించి నీటిపై తేలియాడే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనికోసం 200 అడుగుల వరకు ఇసుకను విస్తరించాల్సిన అవసరం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక క్రేన్ లను ఉపయోగించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
అలాగే ఈ ఉదయం నుండి 11 టగ్ బోట్లు ఎవర్ గివెన్ నౌక ని లాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 80% వరకు నౌక సరైన దిశకు తిరిగిందని ఈజిప్ట్ సూయజ్ కాలువ అథారిటీ వారు తెలియజేసారు. ఈజిప్ట్ సూయజ్ కాలువ అథారిటీ చెప్పిన దాని ప్రకారం, చిక్కుకున్న ఓడ సరైన దిశలో 80 శాతం వరకు తిరిగింది. తీరం నుండి 102 మీటర్లు అంటే దాదాపు 335 అడుగులు కదిలినట్టు చెబుతున్నారు. అయితే ఇలా ఓడ సరైన దిశకు చేరుతున్నపటికీ వెంటనే సూరజ్ కాలువ లో ఏర్పడిన అంతరాయాన్ని పూర్తిగా నివారించడానికి మరియు ఇప్పటికే ఇందులో చిక్కుకున్న ఓడలకు లైన్ క్లీయర్ అయ్యేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.
