Covid-19 Update:దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విస్తరిస్తోందా … క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు…
1 min read
భారత్ లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్
గడిచిన 24 గంటల్లో 89,129 కరోనా కేసులు నమోదు…
దేశంలో లో కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతోంది. దేశంలో లో గడిచిన 24 గంటల్లో 89,129 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ సంఖ్య క్రమంగా రోజు రోజుకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 1,23,92,260 మందికి కరోనా సోకగా అందులో 1,64,110 మంది చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇండియాలో 6,58,909 యక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా నుండి కోలుకున్నావారి సంఖ్య 1,15,69,241కి చేరింది.
ఇదిలా ఉండగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. కేసులు ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, డిల్లీ, మధ్యప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర లో 47,827 కేసులు నమోదు కాగా, 202 మంది చనిపోవడం జరిగింది. ఇందులో ఎక్కువగా బిజినెస్ సిటీ అయిన ముంబై లోనే నమోదయ్యాయి. డిల్లీ లో 3,594 కేసులు నమోదవగా 14 మంది చనిప్వదం జరిగింది. తమిళనాడులో 3,290 కేసులు నమోదవగా 12 మంది చనిపోయారు. కర్ణాటకలో 4,991,మధ్యప్రదేశ్ లో 2,777 కరోనా కేసులు నమోదయ్యాయి.
నిన్న తెలంగాణా రాష్ట్రంలో 1,078 కేసులు నమోదవగా ఆరుగురు మరణించడం జరిగింది. దీనితో రాష్ట్రంలో కరోనా సోకినా వారి సంఖ్యా 3,10,819 కి చేరగా మరణాల సంఖ్యా 1,712 కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,02,207 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్నాయి. 283 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి లో 113, రంగారెడ్డి లో 104 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 1,288 కేసులు నమోదయ్యాయి.
ఈ సెకండ్ వేవ్ కరోనా త్వరగా విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తమవ్వాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని, వీలైంత వరకు వ్యక్తిగత దూరం పాటించాలని, తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది.
