#Acharya: మెగాస్టార్ “ఆచార్య” సంక్రాంతి కి వస్తున్నాడా…? “భీమ్లా నాయక్” ని కలిసింది అందుకేనా…
1 min read
Bheemla With Megastar
పవర్ స్టార్ ని కలిసిన మెగాస్టార్…
సంక్రాంతి వచ్చిందంటే పండగ వాతావరణం తో పాటు టాలీవుడ్ లో సినిమాల సందడి కూడా ఎక్కువే అని చెప్పాలి. సంక్రాంతి కి స్టార్ హీరోల సినిమాల తో ఫ్యాన్స్ సంబరాలు సంబరాలు చేసుకుంటారు. కానీ ఈ సారి కరోనా కారణంగా మన పండగల టైమ్ థియేటర్లలో సినిమాలు లేక చిన్నబోయాయి. అప్పటినుండి వాయిదా పడుతూ వస్తున్న స్టార్ హీరోల సినిమా లు వచ్చే సంక్రాంతి కి విడుదల కాబోతున్నాయి.
ఈ సంక్రాంతి కి సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారి వారి పాట, ప్రభాస్ రాధేశ్యాం, పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వస్తున్న భీమ్లా నాయక్ విడుదల కాబోతున్నాయి. అయితే సంక్రాంతి కి ముందే దసరా పండగకి, క్రిస్మస్ సందర్భంగా కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో ముఖ్యంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13 వ తేదిన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా అల్లు అర్జున్ పుష్ప విదుదల కాబోతోంది. కానీ ఏపీ లో థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోక పోవడంతో ఆర్ఆర్ఆర్ సినిమా ని వాయిదా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలో బోయపాటి, బాలకృష్ణ మూడో సినిమా గా వస్తున్న అఖండ సినిమాని దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
అందరూ తమ సినిమాల విడుదల తేదీని ప్రకటిస్తుంటే, మెగాస్టార్ సినిమా ఆచార్య టీమ్ నుండి మాత్రం ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారని చెప్పొచ్చు. అయితే ఆర్ఆర్ఆర్ కనుక వాయిదా పడితే ఆ తేదీ ని ఆచార్య తీసుకుంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆచార్య సంక్రాంతి బరిలో దిగబోతోందని ప్రచారం జరుగుతోంది. దానికి గాను చిరంజీవి, పవన్ కళ్యాన్ ని కలిసి ఒక ఒప్పందానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మొదట సంక్రాంతి కి పవన్ కళ్యాన్ భీమ్లా నాయక్ విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
మొన్న మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని భీమ్లా నాయక షూటింగ్ లో కలిసినట్టు సమాచారం. అయితే వీరి మధ్య ముఖ్యంగా జరిగిన చర్చ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చిరంజీవి ఆచార్య ని సంక్రాంతి బరిలో దిగాలనుకుంటున్నట్టు చర్చ జరిగింది. కాబట్టి భీమ్లా నాయక్ విడుదల ని కొంత వాయిదా వేసుకోమని అడిగినట్టు, దానికి పవన్ కళ్యాన్ అంగీకరించినట్టు సమాచారం. అయితే ఆచార్య టీమ్ సంక్రాంతి విడుదల తేదీ ప్రకటించే లోపే భీమ్లా నాయక్ ప్రకటించడం తో ఆచార్య ఇలా భీమ్లా నాయక ని కలవాల్సి వచ్చింది.
అయితే ఆచార్య టీమ్ నుంచి విడుదల తేదీ గురించి మెగాస్టార్ పుట్టిన రోజున ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. తరువాత వేదాళం రిమేక్ లో అలాగే, దర్శకుడు బాబీ తో ఒక సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
