Paris Olympics – 2024: వెయిట్ లిఫ్టర్లకు షాక్…ఇకపై ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ చూడలేము…
1 min read
Weightlifitng
గత ఆదివారంతో టోక్యో ఒలంపిక్స్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే 2024 ప్యారిస్ లో జరిగే ఒలంపిక్స్ గురించి చర్చ మొదలైంది. ఈ చర్చల్లో ఇప్పుడొక ముఖ్యమైన విషయం బయటకొచ్చింది. ఒలంపిక్స్ కమిటీ వెయిట్ లిఫ్టర్లకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది, అదేంటంటే ఒలంపిక్స్ జాబితా నుండి వెయిట్ లిఫ్టింగ్ ని తొలగిస్తూ ప్రతిపాదనపై ఐఓసీ (ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ కమిటీ) ఆమోద ముద్ర వేసింది.
ఇకపై ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ ఉండబోదని ఐఓసీ ఆదివారం ప్రకటించింది. ఆదివారం జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు. దీనితో పాటు బాక్సింగ్ ఆట పై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
వెయిట్ లిఫ్టింగ్ ని ఈ జాబితా నుండి తొలగినచడానికి కారణం వెయిట్ లిఫ్టర్లు చాలా కాలం నుండి డ్రగ్స్ తీసుకోవడం అని ఐఓసీ చెబుతోంది. వెయిట్ లిఫ్టర్లు తమ కెరీర్ ని అలాగే కొనసాగిస్తున్నారని, హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వెయిట్ లిఫ్టర్లలో ఎక్కువ మంది డోపీలు తేలుతున్నారని ఐఓసీ చెబుతోంది. కాబట్టి దీనిపై సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఐఓసీ ముందుకొచ్చింది.
కానీ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మార్పు కనిపించకపోవడంతో, అనేక ఫిర్యాదుల మేరకు ఐఓసీ 2024 ప్యారిస్ లో జరగబోయే ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే ఐఓసీ ఈ నిర్ణయం తీసుకోవడం తో లిఫ్టర్లు ఆగ్రహం తో ఉన్నారు. టోక్యో 2020 లో భారత్ తరుపున వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయ్ చాను కు సిల్వర్ మెడల్ దక్కింది. 2024 ప్యారిస్ లో జరిగే ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ లక్ష్యం గా సిద్దమవుతున్న భారత్ వెయిట్ లిఫ్టర్లకు ఇది బాధాకరమైన విషయమని చెప్పొచ్చు.
అయితే 2028 లాస్ఏంజెలెస్ ఒలంపిక్స్ లో తిరిగి ఈ విషయాన్ని చర్చించే అవకాశం ఉందని ఐఓసీ వెల్లడించింది.
