సల్మాన్ ఖాన్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లుంగీ డాన్స్ … ఇండియా మొత్తం పూనకాలు లోడింగ్…
1 min read
Dont Stop Dancing Poonakalu Loading
మాస్ డాన్స్ తో రెచ్చిపోయిన సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, వెంకటేష్…
RRR పుణ్యమా అని తెలుగు, తమిళ్, హిందీ సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని పిలవడం మొదలైంది. దీనితో ఏ భాష సినిమా అయినా అన్ని భారతీయ భాషల్లో విడుదల చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ప్రతీ ప్రాంతీయ సినిమా, మరీ ముఖ్యంగా దక్షిణాది సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడటంతో నిర్మాతలు కూడా నార్త్ ప్రేక్షకులను అలరిస్తూ మార్కెట్ ని పెంచుకుంటున్నారు.
దీనితో దక్షిణాది నటుటకు హిందీ లాంటి భాషల్లో అవకాశాలు వస్తున్నాయి, అలాగే బాలీవుడ్ అగ్రనాయకులు కూడా దక్షిణాది సినిమాల్లో నటించడానికి వెనుకాడడం లేదు. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ (Salma Khan) కి తెలుగు ఇండస్ట్రీ తో మంచి సంబంధాలు ఉన్నాయి. దీనితో సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan). ఈ సినిమా లో విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati), తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒక పాటలో అతిధి గా కనిపించబోతున్నాడు.
నిన్న కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) నుండి మరో పాటని విడుదల చేసారు. ఈ పాటలో సల్మాన్ ఖాన్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా లుంగీలో మాస్ డాన్స్ వేయడం జరిగింది. ఇందులో రామ్ చరణ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. సల్లు భాయ్ కోసం ఓ పాటలో నటిస్తున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ పాట విడుదల కావడం జరిగింది.
ఇది హిందీ పాట అయినప్పటికీ తెలుగు లిరిక్స్ కూడా వాడడం జరిగింది. సల్మాన్ ఖాన్ తెలుగులో మాట్లాడటం, హిందీ పాటలో తెలుగు లిరిక్స్ వాడటం బహుశా ఇదే మొదటి సారి కావొచ్చు. ఈ రోజు వేడుకగా ఉంటుంది ఉంటుంది అనే పదాలతో ఈ పాట మంచి ఊపు తెచ్చేలా ఉంది. ఇక ఈ పాట ప్రతీ ఫంక్షన్ లో మార్మోగడం ఖాయం. ముగ్గురు సూపర్ స్టార్లు ఒకే వేదికపై సాంప్రదాయ దుస్తుల్లో అలా మాస్ డాన్స్ చేస్తూ కనిపించడం తో ఫ్యాన్స్ కి కన్నుల పండుగ అని చెప్పొచ్చు. అందుకే ఈ పాటను యూట్యూబ్ లో తెగ చూసేస్తున్నారు. విడుదలైన గంటల్లోనే 1 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ వచ్చాయి .
ఈ పాటని Vishal Dadlani & Payal Dev పాడగా Payal Dev సంగీతం అందించారు. RAP ని Raftaar తనే రాసి పాడటం జరిగింది. ఈ సినిమా లో సల్మాన్ ఖాన్ తో పాటు, విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డే (Pooja Hegde), జగపతి బాబు (Jagapathi Babu )నటిస్తున్నారు. దర్శకత్వం Farhad Samji వహిస్తున్నారు. ఈ సినిమాని సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు.
మరి మీరు ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి.

Super