సైలెంట్ గా ఓటిటి లోకి వచ్చిన రంగమార్తాండ …ఎక్కడంటే…
1 min read
Rangamartanda Ott Release
థియేటర్లలో విడుదలైన 20 రోజుల లోపే ఓటిటి లో విడుదల.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా రంగమార్తాండ(Rangamarthanda) . ఈ సినిమా మార్చి 22 వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కి విమర్శకుల నుండి కూడా ప్రశంశలు అందుకున్నాయి. ఈ సినిమా పెద్దలు అందరూ కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ముఖ్యంగా ఈ సినిమాకి మూలస్తంభాలైన నటులు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ. వీరి నటనకు తెలుగు సినీ పరిశ్రమ ఫిదా అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా మరాటి సినిమా నట సామ్రాట్ ఆధారంగా తీసారు కృష్ణవంశీ.
సినిమా చాలా భాగుందని ఎంత ప్రచారం జరిగినా ఇది రెగ్యులర్ సినిమా కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడడానికి అంత సుముఖత చూపలేదు. అలాగే ఎలాగు ఈ సినిమా కొద్ది రోజుల తర్వాత ఓటిటి లో విడుదలవుతుంది, అప్పుడు చూద్దాం అనికూడా ప్రేక్షకులు భావించి ఉంటారు. దీనితో ఈ సినిమా ని చాలా సైలెంట్ గా ఎలాంటి ప్రచారాలు లేకుండా ప్రముఖ ఓటిటి లో విడుదల చేసారు. ఈ రోజు నుండి ప్రముఖ ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి వచ్చింది. మరి ప్రేక్షకులు ఓటిటి లోనైనా ఈ రంగామర్తాండ ని ఎంతవరకు చూస్తారో చూడాలి. ఒకరకంగా ఈ సినిమాని ఓటిటి లో చాలా తొందరగా విడుదల చేసారనే చెప్పొచ్చు. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోపే ఈ సినిమా ఓటిటి లో అందుబాటులోకి వచ్చింది.
ఇక రంగ మార్తాండ కథ విషయానికి వస్తే నాటక రంగమే ప్రపంచంగా బతికి, రంగస్థలం పై ఎన్నో పాత్రలని రక్తి కట్టించి జీవం పోసిన నటుడు రాఘవరావు (ప్రకాష్ రాజ్). ఈయనకి నాటక రంగమే ప్రపంచం. అలా బతికిన ఆయనకి రంగ మార్తాండ బిరుదు లభిస్తుంది. మరొక రంగస్థల నటుడు చక్రపాణి (బ్రహ్మానందం) మరియు రాఘవరావు మంచి స్నేహితులు. వేరిద్దరూ కలిసి చాలా ప్రదర్శనలు ఇచ్చి ప్రజల మన్ననలు పొందినవారు. ఒకరికొకరి తోడుగా నిల్చున్నవారు. అయితే రాఘవరావు రంగామార్తండ బిరుదు రాగానే అదే వేదికపైన తను ఇక నాటకరంగం నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటిస్తాడు. అలాగే తను సంపాదించినదంతా తన కుటుంబ సభ్యుల పేర్లమీద రాసేస్తాడు. ఇంటిని, బ్యాంక్ ఉన్న డబ్బు ని ఇలాగా మొత్తం తను ఏమి ఉంచుకోకుండా కుటుంబ సభ్యులకు పంచుతాడు.
ఇక ఇక్కడి నుండి రాఘవరావు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, తన కుటుబ సభ్యులనుండి ఎలాంటి మాటలను ఎదుర్కున్నాడు, ఆ సంఘర్షణలు దేనికి దారి తీసాయి. చివరికి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాల్సిందే.
